ఒకే గర్భాలయంలో 108 శివలింగాల ప్రతిష్ట
రామచంద్రపురం
రామచంద్రాపురం మండలంలో శ్రీశ్రీశ్రీ కామాక్షి దేవి సమేత కోటిలింగేశ్వరం స్వామివారి నూతన ఆలయ మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఒకే గర్బాలయంలో 108 శివలింగాలు ప్రతిష్టించారు.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువు కట్ట క్రింద వెలిసి ఉన్న పురాతన ప్రసిద్ధిగాంచిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి, శ్రీ భవాని జలకంఠేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వరాలయం మహా కుంభాభిషేకం సోమవారం ఉదయం శుభలగ్నంలో వైభవంగా ఆగమ శాస్త్ర ప్రకారం శాశ్వతంగా నిర్వహించారు. ఈ కుంభాభిషేకానికి శనివారం నుండి ఆలయంలో 108 శివలింగాలకు సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం , ప్రత్యేక పూజలు రుద్ర హోమం, దేవి హోమం, ప్రాణ ప్రతిష్ట, మహా పూర్ణాహుతి, నిర్వహించారు. ఉదయం 9:15 నిమిషాల నుండి 9 గంటల 45 నిమిషాలు శుభ ముహూర్తమున మహా కుంభాభిషేకం వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల మద్య వైభవంగా జరిగింది. కార్తీక మాసం సోమవారం తో శ్రీ భవాని జలకంఠేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు.భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క కుంభాభిషేకంలో పాల్గొన్నారు. ఒకే గర్బాలయంలో 108 శివలింగాలు ప్రతిష్టించడంతో భక్తులందరూ శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఐదు గంటల 30 నిమిషాలకు శివపార్వతుల కల్యాణం అంగవైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు దీపాలు వెలిగించి ముక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వహకులు తీర్థప్రసాదాలు తో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మహా కుంభాభిషేకం కార్యక్రమాలు తంజావూరు మణి దంపతులు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించారు.