చలో విజయవాడ
కాకినాడరూరల్
రాష్ట్రంలో దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కోరుతూ వచ్చే నెల 5న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి, రక్షణ, సమాజ సంరక్షణ కోసం కోటి మంది హిందువుల మద్దతు కోరుతూ స్కానింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని రవిశంకర్ పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా, చందర్రావు ,అడబాల రత్న ప్రసాద్, ప్రసాద్ నాయుడు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.