Wednesday, November 27, 2024

Creating liberating content

రాజకీయాలుప్రమాదం కూడా పరిహాసమేనా..?

ప్రమాదం కూడా పరిహాసమేనా..?

పసికూన ప్రాణం పోతే పలకరింపు లేదు ..
వయస్సు పోతే వాలిపోరని వాగుడు..
యవ్వనస్తుడివి అవ్వు…యవ్వారాలు చేసుకో..
ఏ ప్రాణము పోతే నీకెందుకు…
పసికూనలపై పాడు మాటలేల..
ఉన్నంత సేపు నా పాప అంటూ పట్టుకుని ఉంటివి..
ప్రాణం పోయాక పాడు మాటలు లేల
పెద్దమనిషి నంటూ నీకు నీకే కితాబు..
నీ పైసలు ఉన్నంత వరకు నీ ఆర్భాటాలు…
నీ రూపాయి లేదన్న రోజు నిన్ను పాపం అనికూడా అనరు..
నీ పాటలు ..నీ పలుకులు ..నీ పనికిమాలిన చేష్టలు…
ప్రాణ మన్నది పై వాడి దయ..
అదేమీ షాపింగ్ మాల్ అంత ఈజీ కాదు ..

(కృష్ణ సింధు,క్రైం)
మానవుల దృష్టిలో పుట్టడం అంటే ఇంతకుముందు లేనిది ఏదో రావడం. గిట్టడం అంటే ఇప్పటి వరకు ఉన్నది పోవడం. రెండు వేరు వేరుగా కనపడుతున్నా కానీ పుట్టడం అన్నా గిట్టడం అన్నా రెండూ ఒకటే! ఎలా అంటే ఏదైనా ఒక వస్తువు తన పూర్వావస్థ ( అంటే ఇంతకు ముందున్న స్థితి )ని వదిలి ఉత్తరావస్థ ( అంటే ఇప్పటి స్థితిని వదిలి తరువాత స్థితి )ని పొందడాన్నే పుట్టడం అంటారు. గిట్టడం అంటే కూడా అదే అర్ధం వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నస్థితిని వదిలి దాని తరువాత స్థితికి వెళ్ళడాన్ని గిట్టడం అంటారు.మరి ఇవి కూడా తెలియని ఒక మేధావి తన పైత్యం తో చిలుక పలుకులు పలుకుతుంటే పాటల లోకం ఫక్కున నవ్వుకుంటుంది.ఓ గాయని పాటల కోసం ప్రాకులడుతూ పసికూన అని చూడకుండా పరిగెడుతుంటే ప్రమాదంలో ప్రాణాలు పొగుట్టుకుంది. ఆ ప్రాణం పోయిందని ఎన్నో ప్రాణాలు విల విల లాడి పోయి పరుగులు తీసి పసికూన పై ప్రేమ చూపించి ఆ పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.కానీ ప్రక్కనే ఉన్న పడుచు కుర్రాడిని గొప్పలు చెప్పుకుంటూ ఆ పాప ఉన్నప్పుడు నా పాప నా పాప అని పై పై పలుకులు పలికిన ఆ నోరు ఆరోజు ఎక్కడికి పోయిందో తెలియదు. ఈయన రాకపోయిన ఆ పసికూన తిరిగిరాదు కానీ ప్రమాదాన్ని కూడా పరిహాసంగా పలుకుతుంటే పక్కన వారు కూడా పైసలకోసం ప్రాకులాడుతూ అయ్యో ఏమిటి ఇలా అని ఖండించలేని స్థితిలో ఉన్నారంటే కళామాతల్లి ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఒకడు మరణం ఒకడి జననం అన్నది పై వాడి దయ.అంటే చేతపడులు ఉన్నాయని అంటున్నారు అలా అయినా ఆయుస్సు పుట్టినది గిట్టుకు టైం రానిది ఏమి కాదన్నది భగవతానుగ్రహం పొందిన వారి మాట.షాపింగ్ మాల్ లాగా కొనడం పడేయడం అనుకుంటే పొరపాటన్నది తెలుసా లేక తెలియని అజ్ఞానమా…తెలిసినా పొగరా అన్నది అంతా ఆ పై వాడికి తెలియాలి.అసలు మరణం అంటే ఏమిటీ ఎందుకు మరణాన్ని చూసి మనిషి భయపడుతున్నాడు అంటే… మరణానికి మరొక మారుపేరు “మార్పు”. మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ మరణం అనే పదాన్ని వాడగానే చాలా భయపడి పోతూవుంటాం. మానవునికి జీవించివున్నప్పుడు ఆరు దశలున్నాయి. వీటినే “అవస్థాషట్కము” అని అంటారు. అవి 1. పుట్టుట, 2. ఉండుట, 3. పెరుగుట, 4. మారుట, 5. క్షీణించుట, 6. నశించుట. దీనినే భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగము 13వ శ్లోకంలో నాలుగు అవస్థలుగా చెప్పారు.జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని. ఇవన్నియూ మార్పులే అని. మనిషి, బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు, యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయం పొందుతూ ఉంటాడు. మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల తాను ప్రేమిస్తున్నవి తాను అనుభవిస్తున్నవి సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలుగచేస్తుంది.భూమి పుట్టి ఇంతకాలమైనా ఇన్ని మరణాలు చూసినా మనిషికి ఈ మృత్యు భయం వీడకపోవటానికి కారణం ‘మోహం’ మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు, ధర్మరాజుని ప్రపంచంలో అన్నిటినీమించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు! అందుకు ధర్మరాజు ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవటమే ఆశ్చర్యమని చెబుతాడు! మృత్యువుని గురించి నచికేతుడు యమధర్మరాజుని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అది ‘కఠోపనిషత్’ గా ప్రసిద్ధి చెందింది. ఇక భగవద్గీతలో కూడా దీన్ని గురించి చెప్పబడింది. దాని ప్రకారం – ఏది అభౌతికమైనది అంటే.‘ఆత్మే’ అభౌతికమైనది.దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ’ అవుతుంది. ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం. భూమిలోను అగ్నితత్వం. అగ్నిలోను, జలతత్వం, జలములోను వాయుతత్వం. వాయువులోను శబ్దతత్వం. ఆకాశంలోను లయమౌతాయి. ఇదీ క్లుప్తంగా గీత చెప్పింది.నాకు అన్నీ తెలుసు అన్న మనిషికి అసలు ఏమీ తెలియదు అనే ఒక నానుడిని మీరు కూడా వినే ఉంటారు. నేను భగవదానుభూతిని పొందాను, ఆధ్యాత్మిక వికాసం అంటే ఏమిటో నాకు తెలుసు అని ఎవరైనా అంటే దానర్ధం స్టేషన్ కు వెళ్ళటానికి నాకు దారి తెలుసు సుమా అని. స్టేషన్ ఒక స్థిర ప్రదేశం దీన్ని చేరుకోవటానికి అనేక మార్గాలున్నాయి. ఈ రోజుల్లో ఒక్కక్క మార్గానికి ఒక్కక్క గురువు ఉన్నాడు. నిజానికి వాళ్ళు చెబుతున్ననాకు తెలుసు నేను చూసాను అంటే వాళ్ళు ఏదో చూసారు ఆ చూచినదానికి కట్టుబడి ఉన్నారు.వాళ్ళంతా గతంలోనే ఉన్నారు. గతం కాలంలో కరిగి పోతుంది. అది సజీవమైంది. స్టేషన్ లాగా అది స్థిరమైన ప్రదేశం కాదు. మృత వస్తువు అంతకన్నా కాదు. విశ్వాసం నిజం కాకపోవచ్చు, అదే సత్యం కాదు కూడానేమో. కొంతమంది భగవంతుని విశ్వసించవచ్చు, కొంతమంది విశ్వసించక పోవచ్చు. ఎవరి విశ్వాసంలో వారికి ప్రామాణికత లుంటాయి. మన ఆలోచనలకు అనుగుణంగా మనం విశ్వాసాలను ఏర్పరుచుకున్నాం. మరి ఇంతకూ నిజం ఏమిటో ఎలా తెలుస్తుంది? నిజం తెలుసుకోవాలంటే మనసు స్వేచ్ఛగా ఉండాలి.విశ్వాసం, అవిశ్వాసం ఈ రెండింటిలోను దానికి తావులేదు. నిరంతరమూ అన్వేషించటమే సత్యాన్ని తెలుసుకోవటానికి మార్గం ఏదో ఒక మార్గంలో అన్వేషించాలి. ఆ మార్గం తప్పైతే మరో మార్గం! మరణభయాన్ని విశ్లేషించి చూస్తే మరణించేటపుడు పొందవలసిన దేహబాధ పెట్టే భయం కన్న మరణం తరువాత నేను మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది. ఇన్ని గ్రహించిన తర్వాత మనిషి ఎదుటి వారి మనస్సును, అంతరాత్మ పరమార్దాన్ని తెలుసుకోగాలుగుతున్నాడా.. ఇదే అందరూ గమనించి అవసరమైనప్పుడు ఒకలా అవసరం లేదు…ఇక ఆ అవసరం ఉన్నా అవకాశాలు లేకుండా పోయినప్పుడు అవకాశవాద మాటలు అమాట్లాడితే ఆవేశంగా ఉన్నా ఆవేదన తో ఆలోచించి అడుగులు వేసిన రోజు ఆ భగవంతుడు ఆలోచన చేస్తాడన్నది ఆ పరమాత్మ పై ఉన్న అపార నమ్మకం.ఇది అనుసరిస్తే ఆయుస్సు ఉంటుందా పోతుందో అనేది అంగడిలో సరుకు కాదన్నది అవగతమవుతుందని అర్థమయితే చాలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article