హాజరై ఆశీస్సులు అందించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట
జగ్గంపేట మండలంజె కొత్తూరు గ్రామానికి చెందిన యువ గళం టీం సభ్యులు అలుగోలు సురేష్ పుట్టినరోజు వేడుకలు స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు నకిరెడ్డి సూర్యవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సురేష్ కు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో కేసిరెడ్డి శ్రీను, దంట కామరాజు, అడపా గంగాధర్, అడపా తాతాజీ, సైనం శ్రీను, నకి రెడ్డి జియ్యాన్న, యువ గళం యూత్ సభ్యులు పాల్గొన్నారు.