పలాస
రాష్ట్ర అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన పుచ్చ ఈశ్వరరావు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ని, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ని మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం తమ ను గుర్తించే ప్రక్రియలో మీ కృషి ఉందని కొనియాడారు. పార్టీ కోసం కష్టబడి పనిచేసినవారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వం అందించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మంత్రి, ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అంతకుముందు మంత్రి మరియు ఎమ్మెల్యే కి దుశ్శాలువతో చిరు సత్కారం చేసి, పుష్పగుచ్ఛాలనందించారు. అలాగే నౌపడా టు పూండి వయా వెంకటాపురం డబల్ రోడ్డు కోసం మంత్రి మరియు ఎంఎల్ఏ గారి దృష్టిలో పెట్టడం జరిగింది.

కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు సూరాడ మోహనరావు, ప్రధాన కార్యదర్శి కర్ని రమణ, గోవిందు పాపారావు, దున్న షణ్ముఖరావు, మదనాల జోగారావు, సత్యం, నారాయణ తదితరులున్నారు.