గమక నమకాలు రాకపోయినా…
*గాన గంధర్వుడు.. గాన సామ్రాట్….లలిత కళా సామ్రాట్ బిరుదులు…
*ఆవేమైన మెడలో వేసుకునే ఆభరణాలు కాదుగా…
*ఆభరణాలు అంగడిలో దొరుకుతాయి…
*అవార్డులు ఆలాపనలు బట్టి వస్తాయి…
*సంగీతమనేది ఒక శాస్త్రం…
*చదివితే నేర్చుకుంటే వస్తుంది…
*ఏ గాణమైన నా గాణమే నిజమంటుంటే…
*నవ్విపోతారు గా నాట్యరంగం…
*కాండ్రించి ఉమ్మేస్తుంది గా కళారంగం…
*ఇలంటి వారికోసమేనా ఆ మహనీయులు అంత కష్ట పడ్డది….
*కాసులు అవసరమే…కానీ కళామాతల్లి ని చూడాలి గా…
*కళామాతల్లి పై కరుణలేక పోయినా పర్వలేదు..కన్నీరు రాల్చితే ఎలా…
*పరిహాసానికి పదనిసలు ఉండవు గా…
*పాటంటే ప్రాణం ఉండొచ్చు ..ఆ పాట ప్రాణం తీస్తుంటే…..
*ఆనాడు ఆ పాట పాడిన వారు చూస్తే పరిస్థితి ఏమిటీ…
*పాటల ప్రపంచంలో పూలు నింపకపోయినా పర్వాలేదు…
*పాటల మాటున పుస్తులు తీసేలా ఉంటే…
*ప్రక్కున నవ్వదా ప్రేక్షక లోకం…
(కృష్ణ సింధు ,ప్రజాభూమి కల్చరల్ ప్రతినిధి)
“అ…అ….అ…..
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
వల్లకి మీటగ పల్లవపాణి
అంగుళి చేయనా పల్లవిని
శారద స్వరముల సంచారానికి.
చరణములందించనా
నా పాట పంచామృతం
గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా
విధిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై
స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం
సరస్వతీ సమర్పణం
గగనము గెలువగ గమకగతులు సాగ
పశువుల శిశువుల ఫణుల శిరసులూగ
నా పాట పంచామృతం” అని సిరివెన్నెల సీతారామశాస్త్రీ రచిస్తే శ్రీపండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం తన అమూల్య మైన గానం తో ఆలపించారు. ఈ పాటలో ఎంత అర్థం ఉందొ తెలుసుకుంటే సంగీత ప్రియులు ఎంతో కుతుహులంగా ఉంటుంది.
ఇంతటి అర్థవంతమైన సంగీతాన్ని సరిగా పాడటం కాదు ఉచ్చారణ కూడా చేయలేని ఓ పనికిమాలిన వాడు తన పాటే పంచామృతం అని పది రూపాయలు వేదజల్లి పాటలు పాడుతుంటే పదనిసలు తెలియక పోయినా శ్రీ పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం బిరుదులను తగిలించుకుని చెలామణి అవుతుంటే ఈ సంగీత ప్రపంచం ముగబోతుంది.
గమక నమకాలతో సాగితే గగనం కూడా గెలవక పోతుందా అని ఆ పాటలోనే అర్థముంటే ఈ గాన గంధర్వుడు గగగా నిసని సదనిపస అనేవి కూడా రాకుంటే పాటల మాంత్రికుడు ,గాన సామ్రాట్ లలిత కళా సామ్రాట్ అని చెలామణి అవుతుంటే సచ్చిపోతుంది సంగీత ప్రపంచం.
అపారమైన సంపద ఉందని ఆభరణాలు వేసుకున్నంత సులువుగా సంగీతం లో అపర బ్రహ్మలు గా ఉన్నవారి బిరుదులు తగిలించుకుని ఉరేగుతాను అంటే ఊరికే చూస్తూ ఉండదు గా ఈ సంగీత ప్రపంచం.సంగీతమనేది సంతలో సరుకు కాదుగా…అది ఒక శాస్త్ర పరిజ్ఞానం కలిగి శృతి లయల సంగమముతో గమక నమకాల కుడికతో కూడుకున్నది. ఏ గానం అయినా నా గానం అంటూ పైత్యం తో పాడుతుంటే పాటలు విని పరవశించి పోవాల్సిన పాటక లోకం పారిపోదామ అన్న తీరుకు చెరుకునే పరిస్థితి ఏర్పడిందని చర్చించుకుంటున్నారు.కళామాతల్లి మీద ఉన్న అభిమానం చంపుకోలేక కొంతమంది కాసుల కోసం కక్కుర్తి పడి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే అడిగి మరీ అర్ధించి ఆపార మధురమైన సంగీతాన్ని అప్రతిష్ట పాలు చేస్తుంటే అసహ్యహించు కొంటోంది అభిమాన కళారంగం.
కారులో షికారు కు వెళ్దామా అన్న అతి సులువుగా అమోఘమైన అనేక పాటలను అల్లరి చిల్లరి గా అలపిస్తుంటే అయోమయంతో ఆవేదన చెందుతున్నారు సంగీత ప్రియులు. ఇలాంటి పాటలు వింటే ఆనాడు పాటలు పాడి ఈ ప్రపంచానికి పదనిసలు అందించిన వారు పారిపోయి పరుగులు తీస్తారేమో అన్న ధర్మ సందేహం కలుగుతోంది. ఇక పాటల మాటున పుస్తకావిష్కరణ జరిగిందని ఆ పుస్తకావిష్కరణ లో ఎవరెవరి పుస్తులు తెంచాలని ప్రయత్నాలు చేస్తున్నారని పొద్దుభోని మాటలు చెప్పి అబద్ధపు ప్రచారానికి తెరలేపి అనాధిగా పేరున్న కళారంగానికి మాయని మచ్చ అంట కట్టడం వెనుక ఉన్న అంతర్యమేమిటో విజ్ఞులైన కళాభిమానులు కాస్త గుర్తెరిగి తే కలల్లో ఉన్న కల్మ సాలు కడిగి పారియొచ్చని కొంతమంది కళాభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.