ఆపదలో ఆదుకుంటాననడం..
ఆపై ఆస్తులు రాయించుకోవడం
ఫోన్ తీయలేదని పాయిజన్ బాటిల్ పంపడం ఏమిటో..
పాడితే నాతోనే పాడాలి లేదంటే…?
కారు కొనిపెడతా…దత్తత తీసికుంటా…ఆపై…?
ఆ పది పాటల వెనుక ఉన్న అంతర్యమేమిటీ…?
పైకి బిడ్డలు …లోన గాడిద బుద్దితో…
మాయ లోడి మాటల వెనుక ఉన్న వారెవరు…?
ఈ మయాలోడి వెంట తిరుగుతున్న తమ్ముడీకి కూడా…?
ప్రాణం పోయిన పక్క సీట్లో పాటలు పాడిందట…
ఆహా ప్రాణం ఉన్నప్పుడు ఒక మాట …పోయాక ఇంకొక మాట..
నీ మాయ మాటలతో ఇంకెంత మందిని ముంచుతావు..
ఇదేనా నీ మనిషి జన్మ…
పాటల మాంత్రికుడేనా…ప్రాణాలు తీసే తాంత్రికుడు కూడానా…
అయితే ఇంకెంత మంది ప్రాణాలు పోతాయో..
కాసులివ్వలేదని కథనాలు రాస్తున్నారని కబుర్లా..
ఈ కథనాలు తప్పయితే తలదించుకుంటాం..
నీ కాసుల కోసం కక్కుర్తి పడదీ కలం
కపట వేషాలు ఒక్కొక్క కథనంగా …
కళ్ళు తెరవాలి కళామాతల్లి
అదే ఈ కలం కోరుకునేది..
(కృష్ణ సింధు, ప్రజాభూమి ప్రతినిధి,కల్చరల్)
వయసు నిండుతున్న ..నా మనసింకా పదహారేళ్ళ పసి ప్రాయమే నంటూ వయ్యారాలు వలక బోస్తూ అవే లేలేత ఆశలు…వసివాడనని చిలుక పలుకులు పలుకుతూ వంగిపోయే నడుము,కరిగిపోతున్న కాలం… తరిగిపోతున్న ఆయువును కూడా అపహాస్యం చేస్తూ పైకి మనోధైర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు నటిస్తూ కొత్త యవ్వనమేదో వరమిస్తున్నట్టు నా చేతిలో చేయివేసి చూడు అంటూ అక్షింతలు వేసి ఆశీర్వాదం పేరుతో ఆ తలపై ఈ తలపై చేతులు బెడుతూ నాతో కలిసి వస్తే నాకోట్లు నీకే నంటూ నచ్చిన కారును తీసుకోమంటూ నంగనాచి మాటలు చెబుతూ నాటకాలు వేస్తుంటే నవ్విపోతుంది రా నాట్యమయూరి.నీతో జతగా…నేను, నాతో జతగా నీవంటూ నీవు నా కోట్ల రూపాయలు కు క్యాషియర్ నీవు నా నోట్ల కట్టలకి నౌకరి అంటూ నలుగురికి చెప్పుకుంటూ చెప్పు నేస్తం…..మనసుకు లేనిది…మనకెక్కడుంది వృద్ధాప్యం…?భావాలకు లేనిది..మనకెక్కడిదీ కృత్రిమమైన పెద్దరికం…?ఆశలకు లేనిది…మనకెక్కడుంది మరణం….?అనుభూతులకు లేనిది…మనకెక్కడిదీ… అంతిమ అంకం…??? అంటూ అందరిలో నా ఆత్మ అంటూ కుటిల బుద్ధితో కపట వేశాలు వేస్తుంటే కాసులకోసం కక్కుర్తి పడిన వారు వీడి చేతిలో కాటికి పోయిన వారు ఎందరున్నారో మరి కొందరే బైటికి వస్తున్నారు.ఇతగాడి చిలుక పలుకులు విని చివరికి చితికి చేరితే ఆ చితిని కూడా చిన్నబోయే విధంగా చిల్లరి మాటలు మాట్లాడుతుంటే చిన్న బోతుంది ఈ చిత్రలోకం.ఛిద్రమవుతోంది ఈ చక్కటి ప్రపంచం. చరిత్రలో ఎందరో మహనీయులు ,ముష్ఠి వారుకుడా కనుమరుగు కాకతప్పలేదు. కాకలు తీరిన వారు చివరికి కాటికే పోయారు తప్ప ఇంకొచోటికి వెళ్ళలేదు. పుట్టిన వాడు గిట్టక తప్పదు ..గిట్టిన వాడు పుడతారంటారు.. అది చూసిన వారు లేరన్నది సత్యం. పాటల మంత్రికుడైన పాపాల తాంత్రికుడైన చివరికి చితికి చేరక తప్పదు.“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి || ”నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు ; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు అని గీతలో చెప్పబడింది. అయితే ఈ మయాలోడు కర్మా అకర్మలను ఆలోచన చేయకుండా కాసులతో ప్రతిదీ ముడిపెట్టి చివరికి బాంధవ్యాలు మరిచి కక్కుర్తి తో కాగితాలు రాయించుకుని కర్కశంగా ఆ కుటుంబాలను కష్టాల పాలు చేస్తుంటే కన్నీటీ పర్యంతం అవుతున్నారు ఆ నిరుపేద కుటుంబాల వారు.దీనినే ఆపదలో ఆదుకోవడం అంటారు ఈ మాయలోడి తీరులో. ఈ ప్రపంచంలో పెద్ద ఆధ్యాత్మిక చింతనాపరుడని ప్రవచనాలు పలుకుతూ పాయిజన్ బాటిల్ పంపి తే ఎవరి ప్రాణాలను పణంగా పెట్టి పాడు పనులకు ఒడిగట్టారని అనుకోవాలి.పైకి బిడ్డ లోన గాడిద బుద్ది తో ఆశీర్వదాం పేరుతో అక్షింతలు వేసినట్లు ఆ తలమీద ఈ తలమీద చేతులు పెట్టి ఎవరిని చెడ్డ చేద్దామని తప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఇక్కడ తప్పు ఎవరిదీ అన్నది ఆలోచన చేసేంత అసమాన్యులు ఉన్నారా అన్నది అందరి మదిలో ఉన్న ప్రశ్న. ఇక ఈ మాయలోడి మాయకు ప్రత్యక్షంగా పరోక్షంగా బలైన వారు ఉన్నా…పోయిన ప్రాణం పక్క సీట్లో కూర్చుని పాటలు పాడుతుంటే అయ్యో ఇదేమిటి అని ఆచర్యపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పడం చూస్తే అది నోరా లేక ఇంకెదయిన అయి ఉంటాదా అని అనుమానం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూస్తే ఇది ఒక మనిషి జన్మే నా అన్న ఆలోచన కలుగుతోంది.కాలమనే ఇది లో కపట వేశాలు ఒక్కొక్కటిగా బైటికి వస్తుంటే కాసులివ్వలేదని కథనాలు వస్తున్నాయని కారు కూతలు కూయడం చూస్తుంటే ఆ కనక దుర్గమ్మ కన్నెర్ర చేయక పోదా అన్న ఆవేదన కలుగుతోంది. ఇప్పటికయినా కళామాతల్లి కళ్ళు తెరిచి కుటిల బుద్ధితో కళారంగం లో కీచులాటలు పెట్టి కుట్రలు చేయాలని చూసే వారి భరతం పట్టాలని కొందరు కళాభిమానులు కోరుకుంటున్నారు.