తిరుచానూరు



తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. బ్రహ్మోత్సవాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబం పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న నాని కుటుంబ సభ్యులను వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో పట్టు వస్త్రాలను పూజా ద్రవ్యాలను అర్చకులకు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వేలుపలకు వచ్చి మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు కొలువై ఉన్న చంద్రగిరి నియోజకవర్గ అన్ని విధాల అభివృద్ధి అయ్యేటట్లు తనకు సహకరించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గం ఆధ్యాత్మికతతో నిండి ప్రజలు క్షేమంగా ఉండాలని తెలిపారు. ఈనెల ఆరవ తేదీన జరగనున్న పంచమి తీర్థ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించనున్నారని తెలిపారు. పులివర్తి నాని దంపతులతో పాటుగా , వారి కుమారుడు వినీల్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.