చంద్రగిరి:

చంద్రగిరి మండల పరిధిలోని ఐతే పల్లి-రంగంపేటకు రాకపోకలు స్తంభించాయి.గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా నీటి ప్రవాహం ఎక్కువై పులిత్తివారి పల్లి వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు వల్ల ఐతే పల్లి-రంగంపేటకురాకపోకలు స్తంభించాయి.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానిఆ ప్రవాహం లోనే కాలువ దాటుకుని ప్రజల వద్దకు వెళ్లి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం ప్రజలను పట్టిపీడిస్తుందని,ప్రజల సంక్షేమం,ప్రజా పాలన మరిచి పాలించిన పాలకులు వల్ల ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చాయని, ఐతే పల్లి-రంగంపేట మార్గమధ్యంలో పులిత్తివారి పల్లివద్ద ఉన్న వంతెన కూలిపోయిన గత పాలకులు పట్టించుకోలేదనిఅన్నారు.వెంటనే మండల స్థాయి అధికారులను పిలిపించిసత్వరమే ఏర్పాట్లనుచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.ఎన్నికల సమయంలోగెలిచిన రెండు సంవత్సరాలలో వంతెనలు పూర్తి చేస్తాననిహామీ ఇచ్చానని,దానికి తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసి సుమారు14కోట్ల60లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించానని తెలిపారు.వీలైనంత త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం పనులు చేర్పడతారని గ్రామస్తులకు నాని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేపులివర్తి నానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.
