ఈ నెల 13 నుంచి 44వ శ్రీహనుమద్వ్రత సప్తరాత్ర మహోత్సవాలు .
భీమవరం
భీమవరం మారుతీ టాకీస్ సెంటర్ లోని శ్రీదాసాంజనేయ స్వామివారికీ 15 కేజీల విభూదితో శనివారం ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ఈవో గొట్ట్టుముక్కల నాగ సీతారామరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఘంటసాల పవన్ కుమార్ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికీ 15 కేజీల విభూదితో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈనెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీదాసాంజనేయ స్వామి 44వ శ్రీహనుమద్వ్రత సప్తరాత్ర మహోత్సవాలు జరగనున్నాయి. 13న ఉదయం స్వామివారి గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించనున్నారు. ప్రతిరోజు స్వామివారికి 1,116 కొబ్బరికాయలతో ఏకాదశ రుద్రాభిషేకాలు, 1500 అరటిపళ్ళు, లక్ష తమలపాకులతో వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ జరుగను. 21వ తేదీన ఉదయం 11 గంటలకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు తెలిపారు.