పలాస:
విజయవాడలో గుణదలలో గల ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫీస్ నందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ మన ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జబాబురావు అధ్యక్షన జరిగింది ఇందులో భాగంగా MD గడ్డం శేఖర్ బాబు (IFS) మరియు GM హనుమా నాయక్ పాల్గొని భవిష్యత్తు కార్యచరణ రూపొందించి ఎజెండాలో పొందుపరిచిన అన్ని అంశాలను సుదీర్ఘంగా చర్చించి ప్రస్తుతం కార్పొరేషన్ లో ఉన్న రంగాల్నే కాకుండా మిగతా రంగాల్లో కూడా ప్రవేశించి కార్పొరేషన్ పరిధిని పెంచాలని గత మార్చి ఏప్రిల్ నెలలో ఎలక్షన్ కోడ్ వలన ఇప్పటివరకు సిమెంట్ సేకరణ చేసి గవర్నమెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ లకు సబ్సిడీ రేట్లలో అందించలేకపోయాము కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ లో మరికాస్త ముందుకు వెళ్లి ఎక్కువ స్థాయిలో సిమెంట్ ని సప్లై చేసి కార్పొరేషన్ యొక్క ఆదాయాన్ని పెంచే మార్గాన్ని సూచించారు అలాగే అభివృద్ధికి కావలసిన మార్గాల గురించి చర్చించి కార్పొరేషన్ను అభివృద్ధి దిశగ తీసుకువెళ్లడానికి తమ సాయి శక్తుల ప్రయత్నిస్తామని తెలిపారు