కోట్లాది రూపాయలు చేతులు మారాయి!వందలాది ఎకరాలు చేతులు మారాయి!ఎమ్మార్వో ని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు తెలుపుకోవద్దు!
పుష్కరకాలం నుండి జరిగిన వాటిపై విచారణ చేపట్టాలి!
దళిత సంక్షేమ జాతీయ కార్యదర్శి- రాంబాబు
జీలుగుమిల్లి
పుష్కరకాలం నుండి ఆన్లైన్ అయినా భూములను సి బి సి ఐ డి తో విచారణ జరిపించాలని దళిత సంక్షేమ జాతీయ కార్యదర్శి తగరం రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మండలంలో అనేకమంది రెవెన్యూ అధికారులపై సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆయన అన్నారు.
జీలుగుమిల్లి లో తహసీల్దార్ అవినీతి వ్యవహారం పై అతనికి సహకరించిన కింది స్థాయి ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిలుగుమిల్లి తహాసిల్దార్ కార్యాలయంలో ఎటువంటి హక్కు పత్రాలు లేకుండా ఆన్లైన్ చేసిన వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినాయి దీనిపై సి.బి.సి.ఐ.డి తో ఎంక్వయిరీ వేసి నిజ నిజాలు నిగ్గు తేల్చాలి అని అన్నారు. అధికార పార్టీ నాయకులు వారికి అనుకూలంగా ఉండే అధికారులను గుర్తించి పూర్తి అదనపు బాధ్యతలతో( ఎఫ్ ఏ సి ) తహసిల్దారులుగా నియమించుకొని వారి వారి భూములకు వారికి అనుకూలురైన వారి భూములకు ఎటువంటి హక్కు పత్రాలు లేకపోయినా వారి భూములను ఆన్లైన్లో నమోదు చేయించుకుంటున్నారు. ఇది పూర్తిగా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధం ఇలా అక్రమంగ వారి పనులను సక్క పెట్టుకుంటున్నారు. వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలను కాపాడవలసిన ప్రజా ప్రతినిదులె ఇటువంటి పోకడలకు పాటుపడుతున్నారని అన్నారు. ఇటువంటి వారి ఒత్తిడులకు ప్రలోభాలకు లొంగి అధికారులు బలైపోతున్నారు. ఇది అధికారులు గమనించుకోవాలి, కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకొని, ఇటువంటి పనులు చేయాలని ఆయన అన్నారు. అలాగే ఏళ్ల తరబడి అధికారులు ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించటం కూడా ఇలాంటి పరిణామాలకు తావిచ్చి నట్టైతుందిఅని అన్నారు. జీలుగుమిల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏళ్ల తరబడి ఉన్న ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలి. అలాగే ఈ అవినీతి వ్యవహారంలో కోట్లు చేతులు మారినట్లు స్పష్టం కాబట్టి ఏసీబీ ఈ డి వంటి సంస్థలతో ఎంక్వైరీ వేసి నిజ నిజాలు వెల్లడించి భాద్యులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అలాగే తహసిల్దార్ సస్పెన్షన్ వ్యవహారం పక్కదోవ పట్టించటానికే కొందరు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని తగరం రాంబాబు అన్నారు.
ఈ కార్య్రక్రమంలో దళిత సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షులు గంధం బోస్ ప్రేమ్ పాల్గొన్నారు.