రామచంద్రపురం ఆర్డీవో అఖిల.
రామచంద్రపురం.
రైతు భూ సమస్యల పరిష్కార వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సభల్లో రెండవ రోజు రామచంద్రపురం డివిజన్ పరిధిలో 61 దరఖాస్తులు వచ్చినట్లు రామచంద్రపురం ఆర్డీవో అఖిల పేర్కొన్నారు. ఈ మేరకు కే గంగవరం మండలం
పామర్రు గ్రామం లో నిర్వహించిన గ్రామసభకు ఆర్డీవో దేవరకొండ అఖిల హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్ అధికారి, రామచంద్రపురం నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి అఖిల మాట్లాడుతూ రీ సర్వే గ్రామ సభల్లో వచ్చిన అర్జీలు సిసిఆర్సి కార్డులు అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ అక్రమణలో జాయింట్ ఆర్పిఎం సబ్ డివిజన్లు టైటిల్ సమస్యలపై రైతుల నుండి దరఖాస్తులను గ్రామ సభల్లో స్వీకరించడం జరుగుతుందన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలో బుధవారం నిర్వహించిన గ్రామ సభల్లో రామచంద్రపురం మండలంలో 14 దరఖాస్తులు దరఖా,కే .గంగవరం మండలంలో 26, కపిలేశ్వరపురం మండలంలో 7, రాయవరం మండలంలో 14 మొత్తం 61 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడి అగ్రికల్చర్,మండల స్పెషల్ ఆఫీసర్ ఏ.వి.రంగారావు , తహశీల్దారు బండి ముత్యుంజయరావు , విఆర్వోలు సర్వేర్లు,రెవెన్యూ సిబ్బంది , రైతులు తదితరులు పాల్గొన్నారు.