పోలవరం
పోలవరం మండలం గూటాల గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు , ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు , జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ద ర్శించుకున్నారు.
అనంతరం పట్టిసీమ గ్రామంలోని రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు, ఆర్డిఓ ఎన్వి రమణ ,జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి , జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్
పాల్గొన్నారు.
గ్రామస్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించెందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది ఆయన అన్నారు.
భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూవిస్తీర్ణంలో తేడాలు, ఫ్రీ సర్వే రికార్డుల్లో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, అసైన్డ్ వంటి వాటిపై వినుతలు తీసుకుని పరిష్కారం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పోలవరం మండల అధ్యక్షులు గునపర్తి సత్యనారాయణ(చిన్ని ) ,మొగల్ల హరిబాబు ,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొరగం వెంకలక్ష్మి ,జనసేన నాయకులు కొణతాల ప్రసాద్ , వైస్ ప్రెసిడెంట్ తెలగంశెట్టి రాంప్రసాద్ , కురసం రమేష్, ఆటపాకాల వెంకటేశ్వరరావు ,ప్రధాన కార్యదర్శి చీకట్ల సాయి కృష్ణ మూర్తి , కాకి అయ్యప్ప , మామిడిపల్లి వరప్రసాద్,ఒనిమిరెడ్డి సీతయ్య , పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ మెంబెర్ వీరపుశెట్టి సత్యనారాయణ,మండల్ కార్యదర్శి మామిడిపల్లి స్వాతి,గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కరిబండి గని రాజు, వైస్ ప్రెసిడెంట్ పందిటి రాంకీ, కార్యదర్శి మాదేపల్లి, అచ్చన్న సాన లక్ష్మి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నునకాని రాంబాబు గ్రామ సర్పంచ్ సబ్బారాపు శ్రీరామ మూర్తి ,బీజేపీ నాయకులు కరీబండి నాగరాజు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.