- 1965 యుద్ధంలో పాల్గొన్న సీనియర్ మాజీ సైనికులకు ఘన సన్మానం
- మాజీ సైనికుల సేవలను కీర్తించిన జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్ డి.షేకన్న
అనంతపురము
విజయ్ దివస్ ముగిసి 53 సంవత్సరాలైన సందర్భంగా అనంతపురంలో
కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1965 యుద్ధంలో పాల్గొన్న సీనియర్ మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు.
అనంతపురంలోని హెచ్ ఎల్ సి కాలనీలో ఉన్న వి కె భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు (రిటైర్డ్) చేతుల మీదుగా నాటి యుద్ధ వీరులలు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ, సైనికుల పట్ల తనకున్న గౌరవాన్ని, తాను తాసిల్దార్ గా ఉన్న సమయంలో సైన్యంలో చేరటానికి ఎంతో మందికి శిక్షణ ఇచ్చి అందులో చాలామంది సైన్యంలో చేరిన విషయాన్ని పంచుకుంటూ.. అందుకు గర్వంగా ఉందని తెలిపారు. నేడు యుద్ధ వీరులకు సన్మానం చేయడం తనకు లభించిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నానన్నారు. మాజీ సైనికుల సంఘం గౌరవ అధ్యక్షులు వి.కె.రంగారెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వతంత్ర సమరయోధులు స్వాతంత్రాన్ని తీసుకొస్తే.. పొరుగు దేశాల నుండి మన దేశం చొరబడడానికి ప్రయత్నిస్తున్న శత్రువులతో పోరాడి దేశాన్ని కాపాడతున్న సైనికులంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. 1965 పెద్దవీరులకు సన్మానించిన వారిలో సార్జెంట్ మల్లికార్జున రెడ్డి, సార్జెంట్ పి.గోవింద్ రెడ్డి, హవల్దార్ ఎం.నర్సింహులు, హవల్దార్ పి. సిద్ధన్న, నీలి రత్నం, సిపాయి ఖాజామొహిద్దిన్, టి శ్రీనివాసులు, హవిల్ధార్ మొహిద్దిన్, బాబా రత్నం, వీరనారులు, సి.నాగలక్ష్మి, విజయమ్మలను సన్మానించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కెప్టెన్ పట్నం ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ తిమ్మారెడ్డి తో పాటు పలువురు మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.