Saturday, January 11, 2025

Creating liberating content

తాజా వార్తలు"అర్బన్ "లో సభ్యత్వాల కోసం పెద్ద ఎత్తున విరాళాలు

“అర్బన్ “లో సభ్యత్వాల కోసం పెద్ద ఎత్తున విరాళాలు

  • తాజాగా రూ.50వేలు అందించిన వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పిఎల్ఎన్. మూర్తి
  • సభ్యత్వాల విషయంలో సీరియస్ గా ఫోకస్ చేయాలన్న ఎమ్మెల్యే దగ్గుపాటి
  • అనంతపురము
    స్థానిక అర్బన్ నియోజకవర్గంలో టిడిపి సభ్యత్వాల నమోదు కోసం అందిస్తున్న విరాళాల కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. తాజాగా వాల్మీకి ఫెడరేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి 50వేల రూపాయలు అందజేశారు. అర్బన్ టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గంగారామ్ కు 46వ డివిజన్ నాయకులతో కలిసి ఈ విరాళాన్ని అందజేశారు. ల్ పిఎల్ఎన్.మూర్తిని
    ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రత్యేకంగా అభినందించారు. 46వ డివిజన్ లో పేదలకు సభ్యత్వాల నమోదు చేయించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విరాళాలు అందజేసినట్లు పిఎల్ఎన్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ, ఇంకా చాలా ప్రాంతాల్లో పార్టీ సానుభూతిపరులు సభ్యత్వాల నమోదు చేయించుకోవాలని ఉన్నారని.. ఇలాంటి వారికి మనమే ఆర్థిక సాయం అందించేలా చూడాలన్నారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాలన్నారు. సభ్యత్వాల నమోదు ఇంకా కొందరు నేతలు నిర్లక్ష్యంగా ఉన్నారని..ఇది ఎంత మాత్రం సరైంది కాదన్నారు. అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు పార్టీ శ్రేణులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ నాయకులు చరణ్, నూరుల్లా, అబ్దుల్, గౌస్, షఫీ, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article