-వేధిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి
-ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
హిందూపురం టౌన్
కళాశాల ఫీజులతో సంబంధం లేకుండా డిగ్రీ విద్యార్థులకు హాల్ టికెట్ లు అందజేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు. సోమవారం కళాశాలల యాజమాన్యాల తీరుకు నిరసనగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు. డిగ్రీ విద్యార్థులకు పరీక్ష రాయడానికి హాల్ టికెట్ ఇవ్వాలంటే కళాశాల ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులకు యాజమాన్యాలు వేధిస్తున్నాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ను కళాశాల యాజమాన్యాల ఖాతాల్లోకి వేస్తామని జీవో ఇచ్చి ప్రకటించినా విద్యార్థులకు ఫీజులు కట్టమని ఇబ్బందులు గురి చేయడం తగదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాల పైన యూనివర్సిటీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఎస్ఎఫ్ఐ నాయకులు దిలీప్, అజయ్, సురేష్, నరేష్, సాగర్, హరి తదితరులు పాల్గొన్నారు.