పౌర సరఫరాల శాఖ మంత్రి- మనోహర్
పోలవరం
కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో డబ్బు చెల్లిస్తూ గిట్టుబాటు ధర కల్పిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.పట్టిసీమ గ్రామంలోని ధాన్యం కల్లాలను పరిశీలించిన పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ మరియు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు,ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు .ఈ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖిగా సంభాషించారు, ధాన్యం కొనుగోలు లో ఎటువంటి సమస్యలు ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు,పోలవరం ఆర్ఎస్కే నుండి ప్రతి ఒక్క రైతు కూడా ప్రభుత్వానికి ధాన్యం అమ్మేలాగా చర్యలు తీసుకున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రుసుము చెల్లించడం జరుగుతుందని ఆయన అన్నారు.ఇది మంచి ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం అని అన్నారు . ఈ కార్యక్రమంలోప్రజాప్రతితులు కూటమి నాయకులు, అధికారులుతదితరులు పాల్గొన్నారు.
