Monday, January 20, 2025

Creating liberating content

తాజా వార్తలుఅనుమాన స్పద స్థితిలో యువకుడి మృతి

అనుమాన స్పద స్థితిలో యువకుడి మృతి

పలాస:పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో చిన్నబడం గ్రామంలో శుక్రవారం ఉదయం ఆట్టడ మురళి (26) అనే యువకుడు చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇంటికి సమీపంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు స్థానికులు చెప్పిన సమాచారం మేరకు మురళి గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించి ఇరు కుటుంబాలకు తెలియకుండా దూరంగా వెళ్లి 2022లో పెళ్లి చేసుకున్నాడు యువతి తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించకపోవడంతో ఇద్దరూ రెండు నెలలపాటు గ్రామానికి దూరంగా ఉన్నారు గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత మురళి ఇంటి నుంచి యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్లిపోయారు అప్పటినుంచి వీరి మధ్య వైరం నడుస్తుంది అక్టోబర్ లో యువతి తిరిగి భర్త మురళి వద్దకు వచ్చేసింది అత్తవారింటికి వచ్చిన తర్వాత మళ్లీ యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత తిరిగి రాలేదు మురళి ఎలక్ట్రీషియన్ గా ప్లంబర్ గా పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు మురళి తల్లిదండ్రులు చిన్న కారు రైతులు యువతి తల్లిదండ్రులు ఆర్థికంగా స్థితి మంతులు దీంతో ఈ ప్రేమ వివాహాన్ని మొదటి నుంచి యువతి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నట్టు గ్రామంలో చర్చ సాగుతుంది ఈ సందర్భంలోనే మురళి ఇంటికి సమీపంలో చెట్టుకి ఉరివేసుకొని మృతి చెందడంపై గ్రామంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మురళి ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదని చెబుతున్నారు యువకుడి మృతిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు కాగా ఇటీవల ఆ గ్రామానికి చెందిన బడ్డ నాగరాజును హత్య చేసేందుకు బీహార్ నుంచి సుపారి గ్యాంగ్ వచ్చి పోలీసులకు చిక్కడం గ్రామానికి చెందిన వారి ప్రమేయం ఉన్నట్టు కొందరిని అదుపులోకి తీసుకోవడం ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది ఇప్పుడు గ్రామానికి చెందిన యువకుడు చెట్టుకు వేలాడుతూ మృతి చెందడంపై గ్రామంలో ఏమి జరుగుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతిని తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిది ఆత్మహత్య కాదని హత్య చేసి చెట్టుకి వేలాడదీశారని ఆరోపిస్తున్నారు న్యాయం కోసం మురళి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article