Thursday, November 28, 2024

Creating liberating content

సినిమాఫిబ్రవరి 2 న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్లో "మిస్ పర్ఫెక్ట్"

ఫిబ్రవరి 2 న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్లో “మిస్ పర్ఫెక్ట్”

ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “మిస్ పర్ఫెక్ట్” స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటించారు. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు.ఇవాళ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ – కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం అంటే నాగార్జున గారికి, నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టం. అందుకే అన్నపూర్ణ సంస్థ పెట్టారు. ఈ సంస్థలో చాలా మంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చారు. న్యూ టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడమే ఈ సంస్థ ఉద్దేశం. “మిస్ పర్ఫెక్ట్” సిరీస్ తో మేము అదే ప్రయత్నం చేశాం. ఈ జర్నీలో హాట్ స్టార్ చాలా సపోర్ట్ చేసింది. బిగ్ బాస్ తో అభిజీత్ తెచ్చుకున్న గుర్తింపు మీకు తెలుసు. ఇందులో తను బాగా పర్ ఫార్మ్ చేశాడు. సోగ్గాడే చిన్ని నాయన టైమ్ నుంచి లావణ్యతో నాకు మంచి స్నేహం ఉంది. మిస్ పర్పెక్ట్ కు తనే పర్పెక్ట్ అనిపించింది. ఒక చిన్న కథలో బలమైన క్యారెక్టర్స్ ఉండి మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 2న “మిస్ పర్ఫెక్ట్” డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో చూడండి. అన్నారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ, ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను మిస్ పర్పెక్ట్. సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు మిసెస్ పర్పెక్ట్ అయ్యాను. ఈ సిరీస్ కు ముందు నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ కు స్ట్రెస్ ఫీలయ్యాను. అలాంటి టైమ్ లో “మిస్ పర్ఫెక్ట్” లాంటి ఒక స్క్రిప్ట్ దొరకడం రిలీఫ్ లా ఫీలయ్యాను. అభిజీత్ ను కూల్ స్టార్ అని పిలుచుకోవచ్చు. నువ్వు బాగా నటించావు అని చెబితే..నిజమా అని అడుగుతాడు. మా డైరెక్టర్ విశ్వక్ ఒక మిస్టర్ పర్పెక్ట్. డైలాగ్స్ సరిగ్గా చెప్పని సీన్స్ ఎన్నిసార్లైనా టేక్స్ చేయిస్తారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం. అభిజ్ఞ మంచి నటి. ఈ సిరీస్ లో తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. టైటిల్ కు తగినట్లే మా “మిస్ పర్ఫెక్ట్” పర్పెక్ట్ గా ఉంటుంది. హాట్ స్టార్ లో తప్పకచూడండి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article