బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది. ఆయన 1988లో మరణించారు. తాజాగా ఈ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం (జనవరి 24) కర్పూరీ ఠాకూర్ జయంతి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.కర్పూరీ ఠాకూర్‌ను భారతరత్నతో సత్కరించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. మంగళవారం (జనవరి 22) ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని, అలాగే ఆయన పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని జేడీయూ నాయకుడు కేసీ త్యాగి కూడా డిమాండ్ చేశారు.
మంగళవారం (జనవరి 22) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్పూరి ఠాకూర్ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయాన్ని ప్రకటించారు. కర్పూరీ ఠాకూర్‌ని బిహార్‌లో జననాయక్ అని పిలుస్తారు. కొంతకాలం బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఆయన మొదటి పదవీకాలం డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 వరకు కొనసాగింది. ఆ తర్వాత డిసెంబర్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు సీఎం పదవిలో ఉన్నారు. సోషలిస్ట్ పార్టీ, భారతీయ క్రాంతి దళ్ ప్రభుత్వంలో తొలిసారి కర్పూరి సీఎం కాగా, రెండోసారి జనతా పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు.