ఇంకా షూటింగ్ మొదలు కాలేదు కానీ మహేష్ బాబు – రాజమౌళి కాంబో గురించిన వార్తలు, అంచనాలతో అభిమానుల ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. గుంటూరు కారం ఫైనల్ స్టేటస్ తేలిపోవడంతో ఇక దాని గురించి సెలెబ్రేట్ చేసుకోవడానికి ఏమి లేదు. మహేష్ ని కంప్లీట్ ఊర మాస్ వెంకటరమణగా చూశామన్న సంతృప్తితో హ్యాపీగానే ఉన్నారు. ఇక ఎస్ఎస్ఎంబి 29గా తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి సంబందించిన విశేషాల మీద దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ ఇండియానా జోన్స్ స్ఫూర్తి ఉంటుందని తెలియడంతో వాటిని చూడటం మొదలుపెట్టారు.
ఇండియన్ జోన్స్ లో మొదటి సినిమా రైడర్స్ అఫ్ ది లాస్ట్ ఆర్క్ గా 1981లో వచ్చింది. టెంపుల్ అఫ్ ది డూమ్ 1989, లాస్ట్ క్రూసేడ్ 1989, కింగ్ డం అఫ్ ది క్రిస్టల్ స్కల్ 2008లో రిలీజయ్యాయి. అన్నీ బ్లాక్ బస్టర్లే. అయితే గత ఏడాది వచ్చిన డయల్ అఫ్ డెస్టినీ ఒక్కటే అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. ఇవన్నీ అడవులు, గుప్త నిధులు, గుహల్లో రహస్యాలు, వేటలు, కుట్రల నేపథ్యంలో సాగుతాయి. బొబ్బిలి రాజా, అంజి లాంటి ఎన్నో సినిమాల్లో వీటి రెఫరెన్సులను చూడొచ్చు. ఏళ్ళ తరబడి ఈ ఫ్రాంచైజ్ ని స్ఫూర్తిగా తీసుకున్న ఫిలిం మేకర్స్ ఎందరో చెప్పడం కష్టం.
ఇప్పుడు ఏకంగా రాజమౌళి ఈ తరహా బ్యాక్ డ్రాప్ ని తీసుకోవడమంటే అంతగా ఆ మూవీస్ లో ఏముందని మహేష్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా వాటిని చూస్తున్నారు. అన్నీ ఓటిటిలో అందుబాటులో ఉన్నవే. ఎమోషన్ మిస్ కాకుండా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ లో హీరోయిజంని పీక్స్ లో చూపించే రాజమౌళి ఇప్పుడీ అడ్వెంచర్ డ్రామాని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో ఊహించుకోవడం కష్టం.