పోరుమామి:
పోరుమామిళ్ల మండలం రంగసముద్రం ఒకటవ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న తప్పెట సరితాకు కలెక్టర్ విజయ రామ రాజు ప్రశంస పత్రాన్ని అందజేశారు. విధి నిర్వహణలో సరిత అంకితభావంతో పనిచేయడాన్ని కలెక్టర్ కొనియాడారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. రానున్న రోజుల్లో కూడా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తానని సరిత తెలిపారు.