టి.నరసాపురం.
స్వతంత్ర పోరాట సాధనలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో పయనించాలని తాసిల్దార్ జె వి సుబ్బారావు అన్నారు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను మరువరాదని అంబేద్కర్ రాజ్యాంగంలో మనమంతా స్వేచ్ఛగా సుఖసంతోషాలతో జీవిస్తున్నామని అన్నారు మండలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మంగాకుమారి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు భారీ జాతీయ జెండాతో విద్యార్థిని విద్యార్థులు పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో గ్రామాలలో సచివాలయాల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమాలలో పలువురు ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు