Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలురూ.5141 కోట్ల వార్షిక బ‌డ్జెట్ కు టిటిడి పాల‌క మండ‌లి ఆమోద ముద్ర

రూ.5141 కోట్ల వార్షిక బ‌డ్జెట్ కు టిటిడి పాల‌క మండ‌లి ఆమోద ముద్ర

టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న టిటిడి పాల‌క‌మండలి సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో తీసుకున్న నిర్ణయాల‌ను ఆయ‌న మీడియాకు తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాల్లర్లు తరహలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.లాభాపేక్ష లేకుండా మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు విక్రయిస్తామ‌ని చెప్పారు.2024-25 సంవత్సరానికి 5 వేల, 141కోట్ల 74 లక్షల వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
టీటీడీ పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులుకు స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ 15 వేల రూపాయలు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.. టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను 35 వేల నుంచి 54 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు.వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వేదవిద్యా వ్యాప్తి అధ్యాపకుల వేతనం 51వేలకు పెంపు, 1400 మంది వేద పండితులకు పెన్షన్‌ 12వేలకు పెంపు, టీటీడీ అనుబంధ ఆలయాల్లో విధులు నిర్వహించే..అర్చకుల వేతనం 31వేలకు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక స్విమ్స్‌ ఆస్పత్రిని 1200 పడకలకు పెంచాలని, ఫిబ్రవరి 3,4,5వ తేదీల్లో తిరుమల ఆస్థానంలో ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక, టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు.. టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేసింది. అలాగే, 30 కోట్ల వ్యయంతో గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు నిర్మాణం చేసేందుకు అనుమతిచ్చింది. నారాయణవనంలో వీర భధ్రస్వామి ఆలయం అభివృద్దికి 6.9 కోట్ల రూపాయలు కేటాయింపుతో పాటు స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article