హాట్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ నటించిన రీసెంట్ బోల్డ్ మూవీ మంగళవారం. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మంగళవారం సినిమాకు జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో నాలుగు అవార్డ్స్ అందుకుని సత్తా చాటింది.
జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో (JIIF 2024) మంగళవారం సినిమాకు ఏకంగా 4 అవార్డులు వరించాయి. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాతలు చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో మంగళవారం మూవీ నాలుగు అవార్డ్స్ దక్కించుకున్నట్లు కొత్తగా పోస్టర్ రిలీజ్ చేస్తూ విషయాన్ని తెలియజేశారు.
జైపూర్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా పాయల్ రాజ్‌పుత్ అవార్డ్ అందుకోగా.. ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో రాజా కృష్ణన్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అలాగే ఉత్తమ ఎడిటింగ్ కేటగిరీలో గుళ్లపల్లి మాధవ్ కుమార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ముదసర్ మొహమ్మద్ అవార్డ్స్ అందుకున్నారు. కథ – కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా ‘మంగళవారం’ ఇప్పటికే దిగ్గజాల నుండి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే అని తమ ఆనందం వ్యక్తం చేసారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు.