కూనవరం:
కూనవరం,వర రామచంద్రపురం,ఎటపాక మండలాల ప్రజలు విజయవాడ బస్సు సర్వీస్ గురించి ఎదురుచూస్తున్నారు. ఈ మండలాల ప్రయాణికులు విజయవాడ, గుంటూరు వెళ్లి రావాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్య గురించి గతంలో విజయవాడ డిపిటివో,డిపో మేనేజర్ కి సమస్య వివరించగా స్పందించి రోడ్డు ప్రణాళిక తయారు చేయడం జరిగింది విలీన మండలాల ప్రయాణికుల అవసరార్థం విజయవాడ నుండి చింతూరు కల్లేరు వరకు వెళ్లే సర్వీస్‌ని కూనవరం, రేఖపల్లి, చట్టి మీదుగా కల్లేరు వరకు వెళ్తుందనీ తెలిపారు.రాత్రి విజయవాడలో 11 గంటలకి బస్సు బయలుదేరి భద్రాచలం, కూనవరం, రేఖపల్లి నుండి చట్టి మీదుగా కల్లేరు వెళుతుంది, మరలా రాత్రి కల్లేరులో 7 గంటలకు బయలుదేరి చట్టి, కూనవరం,రేఖపల్లి వెళ్లి తిరిగి 8:30 కు బయలుదేరి భద్రాచలం మీదుగా విజయవాడ చేరుకుంటుంది అని విజయవాడ డిపో మేనేజర్ తెలియజేశారనీ మండ వీర వెంకట సత్యనారాయణ తెలిపారు.