కుందనపు బొమ్మలాంటి లావణ్యం అనుపమ పరమేశ్వరన్ సొంతం. ఒకవైపున తెలుగు సినిమాలు చేస్తూనే, మరో వైపున తమిళ .. మలయాళ భాషల్లో గ్యాప్ రాకుండా చూసుకుంటోంది.అనుపమ మోడ్రన్ డ్రెస్సుల్లోను .. సంప్రదాయ బద్ధమైన చీరకట్టులోను అందంగా కనిపిస్తుంది.అలా పట్టుచీరకట్టులోని ఆమె ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.వరుసగా అనుపమ ఇచ్చిన ఈ స్టిల్స్ చూస్తే, అందం .. అల్లరి ఒక్కచోటునే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆకర్షణీయమైన రూపంతో .. మనసులు కొల్లగొట్టే కోలకళ్లతో తన అభిమానులుగా మార్చేసుకుంటోంది.