Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుచేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించండి

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించండి

  • వారం రోజుల్లో ముద్ర రుణాల రాయితీ జమ చేయండి
  • లేకుంటే జౌళి శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
  • జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలూరి రుషింగప్ప హెచ్చరిక

అనంతపురము
చేనేత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద ఋణాలు
తీసుకున్న అనేక మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇప్పటి వరకూ
రాయితీ జమ కాలేదని, జమ చేయాలని అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే రాయితీలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని, లేని పక్షంలో జౌళి శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలూరి రుషింగప్ప హెచ్చరించారు.
చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చేనేత కార్మికులతో కలసి సంబంధిత అధికారులకు ఆయన వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
దాదాపుగా 12 నెలల క్రితం ముద్రా ఋణాలు తీసుకున్న చేనేత కార్మికులకే కాకుండా, మూడు సంవత్సరాల క్రితం తీసుకున్న రుణాలకు కూడా రాయితీ మంజూరు చేయలేదని అన్నారు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు దృష్టికి పలుమార్లు తీసుకుపోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా జిల్లాలోని పెద్దపప్పూరు, కేసేపల్లి, యాడికి, తాడిపత్రి, పెద్దవడుగురు, సిండికేట్ నగర్, పామిడి, వడియం పేట, బుక్కరాయసముద్రం, ఆకుతోటపల్లి, ఇంకా మిగతా మండలాల్లోని బ్యాంకుల్లో కూడా రాయితీలు జమ కావడం లేదన్నారు. తీసుకున్న ముద్రా ఋణాలకు లబ్ధిదారులు కంతులు కూడా పూర్తిగా కట్టినా రాయితీ మంజూరు చేయలేదని, గతంలో స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు, చేనేత-జౌళి శాఖ జిల్లా అధికారుల దృష్టికి తీసుకు పోయినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రా ఋణాల రాయితీ గానీ, వడ్డీ రాయితీ గానీ చేనేత కార్మికులకు మంజూరు చేయలేదని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా చేనేత జౌళి శాఖ అధికారులు బేఖాతరు చేస్తున్నారని, తాము ఇచ్చిన అర్జీలు కింది స్థాయి అధికారులు చెత్తబుట్టలో వేస్తూ నిర్లక్ష్యంగా వ్యహస్తున్నారని నీలూరి రుషింగప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అర్హులైన లబ్ధిదారుల జాబితాను
వెంటనే తయారు చేసి
రాయితీలను తక్షణం అందజేయాలని, ఒక వారంలోపు రాయితీ, వడ్డీ అందించాలని డిమాండ్
డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, రమేశ్, అచారి, గోవింద్, నాగేంద్ర, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article