వేంపల్లె
స్థానిక పట్టణంలోని వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మదీనా పురం కాలనీలో ఉర్దూ పాఠశాల ఆవరణంలో జరుగుతున్న ప్రత్యేక శిబిర కార్యక్రమంలో భాగంగా 6వ రోజు ఉచిత నేత్ర వైద్య శిబిరమును ఏర్పాటు చేయడమైనదని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యము, నేత్ర ఆరోగ్యము చాలా ప్రాముఖ్యమని ఉచితంగా ఇచ్చే మందులు జాగ్రత్తగా వాడుకొని మంచి ఆరోగ్యము, మంచి చూపు పొందాలని అభిలాషించారు. వాలంటీర్లు గ్రామ వీధుల గుండా సంచరించి దాదాపు 150 మంది పురుషులు, స్త్రీలను 60 మంది విద్యార్థులను సమకూర్చి వైద్య సేవలు పొందుటలో చక్కని పాత్ర పోషించారు. గ్రామ ప్రజలు ఉచిత పరీక్షలు, మందులు తీసుకొని చాలా సంతోషించారు. ఈ కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ యస్. యేసు రత్నం, ఏఎన్ఎం అంజనమ్మ, ఆశా వర్కర్లు నేత్ర పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్. డాక్టర్ ఓబుల్ రెడ్డి అధ్యాపకులు , తేజేంద్ర, ప్రసాద్, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, స్కూలు అధ్యాపకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.