వేంపల్లె
భవిత దివ్యాంగుల విద్యావనరుల కేంద్రoలో చదువుతున్నటువంటి పిల్లలకు చైతన్య మహిళా మండలి వారిచే బెడ్ షీట్స్ 30 మంది దివ్యాంగ చిన్నారులకు పంపిణీ చేయడం జరిగింది. ఎంఈఓ 2 స్టాలిన్ ఇజాక్ మాట్లాడుతూ దివ్యంగా చిన్నారుల పట్ల దాతలు సహకారం మరువ లేనిదని అన్నారు. దాతలు ముందుకు వచ్చి వీరికి అన్నీ విధాలుగా చేయుతని అందిస్తున్నారు అని అన్నారు. ఈ సందర్భంగా చైతన్య మహిళా మండలి ప్రెసిడెంట్ రామాంజనమ్మ మాట్లాడుతూ ఇలాంటి చిన్నారులకు దుప్పట్లు అందజేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. పిల్లలని చూసి వీరిలో ఉన్న లోపాలని చూపకుండా అన్నీ రంగాలలో రాణిస్తున్నారు అని అన్నారు. విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ అధ్యక్షులు నాగన్న మాట్లాడుతూ అన్నీ విధాలుగా చిన్నారులు ఎటువంటి సహాయం చేయటానికి ముందు ఉంటామని తెలిపారు, సేక్రటరీ ప్రసన్నకుమారి , టీచర్ మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. భోజన సదుపాయం నాగన్న కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా టంగుటూరి వెంకటనారాయణ, లైన్ మెన్ జ్ఞాపకార్థం వారి సతీమణి నిర్మల వీరాంజనేయులు చుపులోపం గల విద్యార్థికి మిక్సీని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఇఆర్టిలు యశోద, సుజాత, ఫిజియోథెరపిస్ట్ ఆనంద , సీఆర్పీలు నాగరాణి, కళ్యాణి , సూర్య కుమారి, ఎంఐఎస్ అబ్దుల్ ఖాదర్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.