Thursday, November 28, 2024

Creating liberating content

Uncategorizedవైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కును పంపిణీ

వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కును పంపిణీ

వేముల
_ స్థానిక వేముల లోని ఎంపిడిఓ కార్యాలయం ప్రాంగణం నందు మంగళవారం వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు ఎంపిడిఓ ఏ విజయ రాఘవ రెడ్డి,ఇంఛార్జి ఏపీఎం మంజునాథ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం వైకాపా వేముల మండల కన్వీనర్ నాగేళ్ళ సాంబశివారెడ్డి, జడ్పిటిసి కోకటం వెంకట బయపు రెడ్డి, ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకట నారాయణ ముఖ్య అతిథిలుగా హాజరు అయ్యారు.ముందుగా వైఎస్సార్ ఆసరా నాలుగో విడత లో బాగంగా వైకాపా మండల కన్వీనర్ నాగేళ్ళ సాంబశివారెడ్డి, జడ్పిటిసి కోకటం వెంకట బయపు రెడ్డి, ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకట నారాయణ అలాగే వెలుగు సిబ్బంది సర్పంచ్ సాకే రామాంజనమ్మ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రమాదేవి లు జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 498 డ్వాక్రా సంఘాల గ్రూపులు ఉన్నాయి అని,సంఘాలకు గానూ 4898 మంది లబ్దిదారులకు నాలుగు కోట్ల పది లక్షల ఎనబై వేల రూపాయలు లబ్ధిపొందుతారు అని అన్నారు. ఈ నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా నగదు నీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లబ్దిదారులు కి అకౌంట్ నందు జమ చేశారు అని అన్నారు.నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్ర లో అక్క చెల్లెమ్మ ల కోసం డ్వాక్రా రుణాలను నాలుగు దఫాలో మాపి చేస్తా అని అన్నట్లు గానే వారికి వరుసగా నాలుగో విడత వైఎస్సార్ ఆసరను అందిస్తున్నారు అని అన్నారు.అలాగే అక్క చెల్లెమ్మ ల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు అని వారు తెలిపారు.అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ జగన్ అన్న కి అండగా నిలబడి ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ కి ఓటు వేయాలి అని కోరారు.అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.అలాగే మండల సమాఖ్య అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకు ను వారు కట్ చేశారు,అనంతరం డ్వాక్రా మహిళలకు మెగా చెక్కు ను వారు అందజేశారు. ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ నరసింహ రెడ్డి,ఎంపీటీసీ రామచంద్ర రెడ్డి,ఏపీఎం గురు రాజు, ఏపీజీబీ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ గౌడ్,
,సర్పంచ్ లు నాగెళ్ళ మహేశ్వర్ రెడ్డి, అర్జున,నారాయణ స్వామి,రంగనాథ ము,చెన్నారెడ్డి,రామాంజనేయ రెడ్డి,వెంకట కృష్ణయ్య,
నగ మణికంఠ రెడ్డి,కో ఆప్షన్ మండి మా పీరా, వోక్స్ బోర్డ్ డైరెక్టర్ గౌస్ పీ రా
,మాజీ ఎంపీటీసీ మల్ రెడ్డి,సీసీ లు జ్యోతి,పవన్,సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article