ఏలేశ్వరం:- నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖ రీజియన్ పరిధిలో జరిగిన దుర్మార్గపు సంఘటనకు నిరసనగా ఏలేశ్వరం డిపో గేట్ వద్ద ఎన్ఎంయు సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిపో అధ్యక్ష కార్యదర్శులు కె ఎస్ కె రావు, కేటీ త్రిమూర్తులు మాట్లాడుతూ ఎన్ఎంయు సభ్యులపై విశాఖ డి పి టి ఓ చేస్తున్న అరాచకాల పై మండిపడ్డారు. ఎన్ఎంయు సభ్యులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలన్నారు. సంస్థకు నష్టం కలిగించే చర్యలు ఆపాలని, కేంద్ర కార్యాలయం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని డీపీటీవో విశాఖ పై చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తున్న విశాఖ డి పి టి ఓ ను విధుల నుండి తొలగించాలని, 1/19 సర్క్యులర్ ను చేయాలని, అన్యాయంగా సభ్యులకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించుటకు కారణమైన డి పి టి ఓ ను సస్పెండ్ చేయాలని, కౌన్సిలింగ్ పద్ధతిలో డ్రైవర్ కండక్టర్లకు డ్యూటీ చార్ట్ వేయాలని, అన్ని మెడికల్ సర్టిఫికెట్లకు జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు.