ఏలేశ్వరం:-
ఏలేశ్వరంకు చెందిన SPARC ఫౌండేషన్, శాస్త్రీయ యుగం యొక్క కొత్త శకాన్ని మరోసారి ఆవిష్కరించింది. స్పార్క్(సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్) సంస్థ నుండి ఆఫ్రికా ఖండంలోని పశ్చిమ తీరంలో ఉన్న ఘనా దేశం అత్యంత అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశాలలో ఒకటి గెలాక్సీ ఏరోస్పేస్ ఘనా కంపెనీకి ఏలేశ్వరంనకు చెందిన ఎస్. సాయి ప్రదీప్ (స్పార్క్ చీఫ్ సైంటిఫిక్ ఎగ్జిక్యూటివ్) ప్రత్యక్ష పాడ్‌కాస్ట్ అతిథిగా భారత్ దేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా సాయి ప్రదీప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం
భవిష్యత్ ఖగోళ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్‌ల కోసం అంతరిక్ష వృత్తి, అవకాశాలు మరియు నైపుణ్యాలు కోసం ఇండో ఆఫ్రికా స్పేస్ కొలాబరేషన్ మీట్ అని,
ఆసక్తి గలవారు జనవరి 31వ తేదీ రాత్రి 9:30గంకు ప్రత్యక్ష ప్రసార పాడ్‌కాస్ట్‌ని చూడవచ్చని స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్(ఐ బి ఆర్ అండ్ టిబిఆర్ హోల్డర్) తెలియజేశారు.ప్రతి ఒక్కరికి సాధారణ విద్య కాకుండా సాంకేతిక విద్య కూడా అందించడమే మా ఒక్క ముఖ్య లక్ష్యం అని స్పార్క్ సంస్థ వ్యక్తులు పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు విద్యావేత్తలు స్పార్క్ సంస్థను మరియు సాయి ప్రదీప్ ను అభినందించారు.