ఆదివాసీల సమస్యలపై బిజెపి ఎస్టి మోర్చా ధర్నా
బుట్టాయగూడెం.
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు కేటాయించిన పథకాలు, నిధులు, ఉద్యోగాలు, తదితర అవకాశాలన్నీ నిజమైన ఆదివాసీలకే చెందాలని బిజెపి ఎస్టీ మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు కోట రామచంద్రపురం ఐటిడిఏ వద్ద బుధవారం బిజెపి జిల్లా ఎస్ టి మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో నిరుద్యోగ ఎస్టిలకు ఉపాది కల్పించాలని, నకిలీ ఎస్టిలను నిరోదించాలని, ఐటిడిఏ పరిధిలో ఉద్యోగాలన్నీ స్థానిక ఎస్టిలకే ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ నిధులను మళ్ళించకుండా, సక్రమంగా ఎస్టిలకే ఖర్చుపెట్టాలని, ఎస్ టి లకు నాణ్యమైన విద్యా, వైద్యం అందించాలని, పోలవరం నిర్వాసిత ఆదివాసీలకు నాణ్యమైన ఇల్లు , మౌలిక సదుపాయాలు, శాశ్వత ఉపాది కల్పించి, వివాదాలు లేని భూములు నిర్వాసితులకు ఇవ్వాలని, 2013 భూసేకరణ చట్టం అమలు చెయ్యాలని
నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టిమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎస్టిలకు అనేక పధకాలు పెట్టి, త్వరితగతిన ఆదివాసీలను అభివృద్ది చేయాలని చిత్తశుద్దితో పనిచేస్తూ వేలకోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉంటే, ఆదివాసీలపై చులకన భావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఇతర పధకాలకు మళ్లిస్తూ ఎస్టిలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. బోగస్ ఎస్టిలపై విచారణ చేసి నిజమైన ఆదివాసీలకే ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు దక్కేలా చూడాలని కోరారు. జిల్లా ఎస్టిమోర్చా అధ్యక్షులు వంకా కాంచనమాల మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలకు డిజిటల్ లైబ్రరీ సౌకర్యం కల్పించి సాంకేతిక విద్యను అందించాలని, మహిళలకు నాణ్యమైన వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. చదువుకున్న యువతకు శిక్షణ ఇచ్చి ఉపాది కల్పించాలని కోరారు. ఈ మేరకు ఐటీడీఏఅదనపు ప్రాజెక్ట్ అధికారి పివి శ్రీనివాస నాయుడుకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమం లో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బోల్లిన నిర్మలా కిషోర్, జిల్లా ఇన్ చార్జ్ ఏపిఆర్ చౌదరి, నియోజకవర్గ కన్వినర్ కొండేపాటి రామకృష్ణ, కో కన్వినర్ బి.వెంకటలక్ష్మి , జిల్లా ఉపాధ్యక్షుడు కరిబండి నాగరాజు , జిల్లా కార్యదర్శి చట్రాతి ప్రసాద్, మండలాల అధ్యక్షులు బొమ్మా బాబు(కొయ్యలగూడెం), దొమ్మేటి లక్ష్మి జనార్ధన్(బుట్టాయగూడెం) , కొండపల్లి ప్రసాద్(జీలుగుమిల్లి), సీనియర్ నాయకులు ముళ్ళపూడి కృష్ణారావు, బొమ్మా రామ్మోహన్రావు, సోము హరినారాయణ, మక్కిన శ్యాం సుందర్ , పాపోలు పూర్ణ శేఖర్, నూతనం గా పార్టిలో చేరిన యువ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.