- మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సిఎం జగన్ దే
- నాలుగో విడత ఆసరా మెగా చెక్కు పంపిణీ
వేంపల్లె
రాష్ట్రంలోని మహిళా సాధికారత సిఎం జగనన్నతోనే సాధ్యమైందని జడ్పీటీసీ ఎమ్.రవికుమార్ రెడ్డి, వైకాపా కన్వీనర్ కె.చంద్రఓబుల్ రెడ్డి, ఎంపిపి ఎన్.లక్ష్మిగాయిత్రీలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఉర్దూ షాదిఖానలో ఎంపిడిఓ దివిజ సంపతి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు ఘనంగా నిర్వహించారు. అలాగే ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం స్యయం సహాయక సంఘాల మహిళలు సిఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం జగన్ పాలనలో ప్రతి మహిళ సాధికారత సాధించినట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళల విషయంలో అన్ని రంగాల్లో, వివిధ విభాగాల్లో..చట్టసభల్లో, ఆయా కార్పొరేషన్లో ఛైర్మన్, డైరెక్టర్ పదవులు కల్పించి ప్రముఖ స్థానం కల్పించారన్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, చేదోడు, పాలవెల్లువ, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకం, ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు మంజూరు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళా లోకానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎదైనా ఉందంటే అది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. మహిళల ఆర్థిక స్వాలంబన కోసం డ్వాక్రా పథకం ద్వారా రుణాలు మంజూరు చేసి పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందజేసిన సిఎం జగన్ దేనన్నారు. మహిళల సంక్షేమాభివృధ్ధే లక్ష్యంగా సిఎం పాలన అందిస్తున్నట్లు వివరించారు. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలుపుకున్న సిఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. అలాంటి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావించాలని, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సారధ్యంలో జిల్లా ప్రగతితో పాటు వేంపల్లె మండలాభివృధ్ధి పరుగులు పెడుతోందన్నారు. నిరంతరం ప్రజాసేవకే తప్పిస్తున్న సిఎం జగన్, ఎంపి అవినాష్ లను ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని, రాబోయే ఎన్నికల్లో వారికి ఘన విజయాన్ని అందించాలని కోరారు. అనంతరం రూ.10,06,23,384 ల మెగా చెక్కును స్యయం సహాయక సంఘాల మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ నిలకంఠారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, ఎపిఎం బాలస్వామి, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.