కోటి గృహాలకు ప్రతి నెల 300 యూనిట్ల విద్యుత్‌ని ఉచితంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.”రూఫ్ టాప్ సోలరైజేషన్ని వేగంగా అమలు చేయాలని చూస్తున్నాము. ఫలితంగా.. ప్రతి నెల 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్ సరఫరా ఉచితంగా అందుతుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం మోదీ తీసుకున్న నిర్ణయంలో ఇది ఒ భాగం. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ఏటా రూ. 15వేల నుంచి రూ. 18వల వరకు ఆదా అవుతుంది,” అని తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు నిర్మల.
అన్ని వర్గాల అభివద్ధే ధ్యేయంగా..
2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన సమయంలో.. దేశంలో అనేక సవాళ్లు ఉండేవని నిర్మలా సీతారామన్ అన్నారు. రెండో దఫా గెలిచినప్పుడు.. అభివృద్ధిపై ఫోకస్ చేశామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం వచ్చినా, దానిని శక్తివంతంగా ఎదుర్కొన్నామని వెల్లడించారు.”అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నాము. వనరుల పంపిణీలో లోపం లేకుండా చూసుకుంటున్నాము. మేము చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి,” అని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
2047 నాటికి దేశం.. వికసిత్ భారత్‌గా ఆవిర్భవించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళుతున్నామని స్పష్టం చేశారు. పేదలు, రైతులు, మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నామన్నారు.