Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్బిసి'లకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదే: పులివర్తి నాని…!!

బిసి’లకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదే: పులివర్తి నాని…!!

నా ఇంట్లో కుటుంబ పాలన ఉండదు…!!
ఐటి హబ్ స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా…!!
ఒక్క అవినీతికి పాల్పడ్డా టవర్ క్లాక్ దగ్గర నిలదీయండి…!!

చంద్రగిరి
స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బిసిలకు పెద్దపీట వేశారని తర్వాత నారా చంద్రబాబు నాయుడు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేశారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. గురువారం చంద్రగిరిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మంటపంలో జయహో బిసి సభకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట ఎన్టీఆర్, బిసిల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టక ముందు పటేల్ వ్యవస్థ రాజ్యమేలుతూ బడుగు బలహీన వర్గాలను తీవ్ర ఇబ్బందులు గురిచేసిందన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి బిసిలకు పెద్దపీట వేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించారన్నారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం 24 శాతం తగ్గించిందన్నారు. ఆ పది శాతం రిజర్వేషన్లు కొనసాగి ఉంటే 16480 పదవులు బిసిలకు దక్కేవన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 75 మంది బిసి ముఖ్య నేతలను చంపారని ఇందుకు మాచర్ల ఘటనా ఉదాహరణ అని అన్నారు. అన్ని వర్గాల కోసం విదేశీ విద్య పథకాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకువస్తే .. ఆ పథకాన్ని నామరూపాలు లేకుండా చేశారని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానం ఛైర్మన్ గా బిసి సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ 13 కార్పోరేషన్స్ ద్వారా 50 నుంచి 150 కోట్లు బడ్జెట్ ప్రవేశ పెడితే వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూపాయి నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు.
టీడీపీ కార్యకర్తలు, నాయకులు జోలికి వచ్చిన వారందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు.ఒక్క సారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఎలా చేస్తానో చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నా ఇంట్లో కుటుంబం పాలన ఉండదని నా కొడుకు ఎలక్షన్ తర్వాత బెంగళూరుకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటాడని స్పష్టం చేశారు. వైసీపీ అరాచకాల కారణంగా అమరరాజ ఫ్యాక్టరీ తెలంగాణకు వెళ్ళిందన్నారు. ఇక్కడే స్థాపించి ఉంటే ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. చంద్రగిరిలో ఐటి హబ్ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. నేను ఒక్క అవినీతికి పాల్పడిన నన్ను చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. గౌస్ బాషా, మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రాయల్, నాయకులు వి. రమేష్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, ,సక్కూరి ధనుంజయ రెడ్డి, డిష్ గోపి నాథ్, కాపు వీధి సునీల్, మంగాపురం భాస్కర్, గ్యాస్ నాగరాజ, టైలర్ శంకర్, కారుణ్య మూర్తి, మణి యాదవ్, శివ రాజన్, హరి, హుస్సేన్, గిరి, బుజ్జి,
లంకెళ్ళలలిత,కొంగర రాధ, సునీత, వడ్లపూడి రాధ,భూలక్ష్మి, కొంగర సునీల్ బాబు, తులసి రాయల్, వి. శంకర్‌, వినోద్ రెడ్డి,రామారావు,మనోహర్, జిలాని తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article