టీడీపీ యువనేత పులివర్తి వినీల్ ఘాటు వ్యాఖ్యలు
రామచంద్రపురం
వైకాపా నిరంకుశ పాలన 70 రోజుల్లో పూర్తవుతుందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ అన్నారు. గురువారం ఆయన “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని”, “బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ” కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం మండలం, పుల్లమ్మనాయుడు కండ్రిగ పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన, టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పులివర్తి వినీల్ ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మినీ మేనిఫెస్టో లోని సూపర్ సిక్స్ అంశాలను క్షుణ్ణంగా వివరించారు.
_పాలనలో ప్రచారం తప్ప ప్రగతి శూన్యం!!
వైసీపీ పాలనలో ప్రచారం తప్ప ప్రగతి శూన్యమని వినీల్ ఆరోపించారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం, అరాచకాలు, దాడులు, దోపిడీలు, కూల్చాడాలు తప్ప అభివృద్ధి లేదని అన్నారు. నియోజకవర్గంలో వర్షాలు కారణంగా ధ్వంసమైన బ్రిడ్జిలు, కల్వర్టులు వంతెనలు కనీసం మరమ్మతులకు కూడా నోచుకోలేదన్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో ఎర్రచందనం, గంజాయి విక్రయాలు, ఇసుక, మట్టి మాఫియాలు రెచ్చిపోతున్నాయని చెప్పారు.
వైకాపా నిరంకుశ, నియంతృత్వ పాలన మరో 70 రోజుల్లో అంతమవుతుందని ప్రజా సంక్షేమం కోరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని పులివర్తి వినీల్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా వైసీపీని ఎప్పుడు గద్దె దింపుతామా అని ప్రజలు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇంతటి వ్యతిరేకత ఎప్పుడు చూడలేదన్నారు. భారీ మెజారిటీతో పులివర్తి నానిని గెలిపిస్తామని ప్రజలు భరోసా ఇస్తున్నట్లు పులివర్తి వినీల్ తెలిపారు.