లింగాల
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం ఇప్పట్ల విద్యార్థులకు ప్రత్యక్షంగా బోధించిన అనుభవాలతో ఉత్తమ అభ్యసనను అందించవచ్చునని పాఠశాల ప్రిన్సిపల్ పి. తులసమ్మ మరియు వైస్ ప్రిన్సిపాల్ టి. లక్ష్మీనరసమ్మ పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ లెర్నెట్ స్కిల్స్ ఫర్ లైఫ్ వారి సహకారంతో పాఠశాల విద్యార్థులను వెంకటాపురం సచివాలయం పరిశీలన కై వృత్తి విద్యా శిక్షకులు బి. పార్వతి మరియు టీ.కవిత తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఆధార్ అప్డేటింగ్ గురించి మరియు క్యాస్ట్, ఇన్కమ్ గురించి సి. శివకుమార్ వివరించడం జరిగింది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు ప్రత్యక్ష అనుభవాల ద్వారా బోధన చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని వృత్తి విద్యా శిక్షకులు చెప్పడం జరిగింది.