బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం లో ప్రజలను కోరిన మారెడ్డి, భూమిరెడ్డి
పులివెందుల
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి అని మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,శాసనమండలి సభ్యులు రామ గోపాల్ రెడ్డి లు అన్నారు. గురువారం మున్సి పాలిటీలో చెన్నారెడ్డి కాలనీ,గాయత్రి కాలనీలలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బీటెక్ రవి గారితో అడుగేద్దాం ఈ కార్యక్రమంలో భాగంగా పులివెందుల ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి (బీటెక్ రవి) ఆయన సతీమణి లతా రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ గాపాల్ రెడ్డి లు టీడీపీ -జనసేన ఉమ్మడి మ్యాని ఫెస్టోలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని నిలువునా ముంచారన్నా రు.రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, దౌర్జన్యం ఎక్కువైందన్నారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి పులివెందులలో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిం చాలని పులివెందుల ప్రజలను కోరారు.ఈ కార్యక్ర మంలో అ కాలనీలోని నాయకులు కార్యకర్తలు, పులివెందుల మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్త లు, ప్రజలు పాల్గొన్నారు.