హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ… ఈ ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేయదని… అలాగే ఏ పార్టీకి మద్దతు ప్రకటించదని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని… అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాని పూర్తి చేసి, ఇక పూర్తి సమయాన్ని రాజకీయ సేవకు వినియోగిస్తానని విజయ్ చెప్పారు. ప్రజాసేవకు రావడాన్ని తనను ఇంతటి వాడిని చేసిన తమిళ ప్రజలకు కృతజ్ఞత తెలుపుకోవడంగా పరిగణిస్తున్నానని అన్నారు.