రామచంద్రపురం
తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం లోని నెత్తకుప్పం గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే వారపు సంతలో ప్రకృతి వ్యవసాయం లో పండించే పంటలు, కూరగాయలు విక్రయం కోసం ప్రత్యేక స్టాళ్లను తిరుపతి జిల్లా ప్రకృతి వ్యసాయం ప్రాజెక్టు మేనేజర్ ఎ.షణ్ముగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో పండించే కూరగాయలు , పంటలు ప్రజల ఆరోగ్యం మెరుగుపడడానికి చాలా దోహదపడతాయని, అలాగే ప్రకృతి వ్యవసాయంలో పండించే రైతులు వారు పండించిన పంటలను విక్రయించుకోవడానికి సులభతరం అవుతుందని, ప్రకృతి వ్యవసాయ మార్కెటింగ్ సిబ్బంది పండించిన పంటలను, వారపు సంతల్లో, మండల కేంద్రాలలో , కలెక్టర్ కార్యాలయంలో విక్రయించడానికి అన్నిచోట్ల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. నేత్త కుప్పం వారపు సంతలో ఆకు కూరలు- గోంగూర, చుక్కకూర, సిర్రకు, మెంతికూర, కొత్తిమీర, గురిగాకు, మునగాకు, కూరగాయలు – చిక్కుడు, బెండ, వంగ, టమోటా, కూర అరటి, వీటితో పాటుగా తీగజాతి, దుంప జాతీ మొదలకు ఉత్పత్తులను స్టాల్లో ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది విక్రయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం పట్టాభి రెడ్డి , ఎన్ ఎఫ్ లు మధు , విమల , ఎంటీలు రాగమ్మ , సుజాత, ఎల్ టు రాజేశ్వరి, ప్రేమ,ఐ సి ఆర్ పి లు , ఫార్మా సైంటిస్టులు, మెండర్స్, రైతులు పాల్గొన్నారు.