తిరుపతి
విద్యార్థులతోనే నేటి సమాజం దేశాభివృద్ధి చెందుతుందని చిన్మయ విద్యా సంస్థల డైరెక్టర్ సత్యమూర్తి ,కరస్పాండెంట్ గీత మీనన్ విద్యాసంస్థల పేర్కొన్నారు.
మార్గ్ చిన్మయ విద్యాలయ వార్షికోత్సవం కళాశాల ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది.ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు . విద్యార్థి, విద్యార్థుల ఆట పాటలతో , పలు సాంస్కృతిక, ప్రదర్శనలు తల్లి తండ్రుల ఆకట్టుకున్నాయి. అనంతరం గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యమూర్తి మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యతోనే అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చుని,అదేవిధంగా నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తల్లిదండ్రులకి గురువులు వారి అడుగుజాడల్లో నడవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాల అవరోధించవచ్చని తెలిపారు. అనంతరం విద్యాసంస్థల కరస్పాండెంట్ గీత మీనన్ మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారానే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి తన కర్తవ్యం నెరవేర్చడం ద్వారా ఇటు తల్లిదండ్రులకు అటు దేశానికి మేలు చేయడం జరుగుతుందని చెప్పారు. విద్యాసంస్థల ప్రిన్సిపాల్ నీలిమ మాట్లాడుతూ నేటి విద్యా విధానం గురించి విద్యలో వచ్చినటువంటి మార్పుల గురించి విలువలతో కూడినటువంటి విద్య వివరిస్తూ అలాంటి విలువలు విద్య ఇచ్చే పాఠశాలలో తన ప్రయాణం ఎంతో ఆనందాన్నిస్తుందని అన్నారు. ఇలాంటి పాఠశాలను స్థాపించిన స్వామి చిన్మయానంద వారు బృహత్య కార్యక్రమానికి బీజం వేసినట్టుగా భావిస్తున్నానని, స్వామీజీ ప్రసంగాలు వింటూ ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు చదివానని, అదేవిధంగా ఇలాంటి పాఠశాలో చదివి దేశానికి ఉపయోగపడే విద్యార్థులు వెలుగొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గీతా మీనన్, డైరెక్టర్లుసత్యమూర్తి , ప్రిన్సిపల్ నీలిమ వైస్ ప్రిన్సిపల్ శ్వేత ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.