వైకాపాలనలో బీసీలకు అన్యాయం
జయహో బీసీ కార్యక్రమంలో వక్తల వెల్లడి
లేపాక్షి :-త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల ప్రజలు ఐకమత్యంగా ఉన్నప్పుడే నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశం ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన లేపాక్షిలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జయప్ప ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లేపాక్షి లోని అంబేడ్కర్ నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాణ సంచా పేలుస్తూ లేపాక్షి పురవీధుల ఆర్ జె హెచ్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కన్వీనర్ జయప్ప మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తున్న సమయంలో పాలకుల నిరంకుశ ధోరణి పెరిగిపోయిందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఈ సమయంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల వ్యవధిలోనే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలను ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రధానంగా బీసీల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ విశేష కృషి చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. పేరుకు మాత్రమే బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లపై ప్రభుత్వం అప్పులు తీసుకుందని పేర్కొన్నారు. బీసీ జిల్లా సంఘం అధ్యక్షుడు రంగయ్య మాట్లాడుతూ, బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పాలన రావాలన్నారు. చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు బీసీలు రాష్ట్రవ్యాప్తంగా ఐక్యతతో ఉండాలన్నారు. ప్రతి టిడిపి నాయకుడు కార్యకర్త తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఎవరున్నా సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగుతాయి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ ముఖ్యమంత్రి కాకపోతే సంక్షేమ పథకాలు రద్దవుతాయని ప్రచారం చేస్తున్నారని ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. ఎలాంటి కారణం లేకుండానే చంద్రబాబు నాయుడుని పంపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కిందన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు. దీపికా రెడ్డి ని బీసీగా సృష్టించి ఆమెను హిందూపురంలో వైకాపా అభ్యర్థిగా నిలిపారన్నారు. ఈ వైకాపా మోసాన్ని బీసీలు తిప్పి కొట్టాలని సూచించారు. టిడిపి నాయకులు రామాంజినమ్మ, సిరివరం కృష్ణప్ప, ద
బేవినహల్లి ఆనంద్ , బాలాజీ, ఎంపీటీసీ గంగాధర్, మాజీ ఎంపీపీ ఆనంద్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, బీసీల ఐక్యతతోనే తెలుగుదేశం పార్టీ రాజ్యాధికారం సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా రాబోవు ఎన్నికల్లో పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగలింగారెడ్డి, బయన్నపల్లి రవి, చంద్రశేఖర్ గౌడ్, పరిమళ, కొల్ల కుంట అంజినప్ప, కిరికెర రాము, ఈడిగ రమేష్, జనసేన మండల కన్వీనర్ లోకేష్, బాలాజీ, మారుతీ ప్రసాద్ లతోపాటు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.