లేపాక్షి :
మండల పరిధిలోని గొంగటిపల్లి ,చోళ సముద్రం గ్రామాల్లో పుట్టపర్తి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, కోఆర్డినేటర్ రవికిషోర్లు మొక్కజొన్న, రాగి ,వేరుశనగ, టమోటో పంటలను శుక్రవారం పరిశీలించారు. శ్రీనివాసరెడ్డి ,ఆదిరెడ్డి, రఘునాథరెడ్డి ,ప్రభాకర్ రెడ్డి, నాగరాజు రైతులకు చెందిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రబీ లో వేసిన మొక్కజొన్న ,వేరుశనగ పంటలకు సంబంధించి ఎరువుల యాజమాన్యం పై తీసుకోవాల్సిన పద్ధతులను రైతులకు ప్రయోగాత్మకంగా వివరించారు .ఈ పంటలను వేసే సమయంలో దుక్కిలోకి ఎకరానికి 150 కిలోల ఎస్ఎస్పి లేదా డీ ఏ పి,యూరియా కలిపి 50 కిలోలు, ఎం ఓ పి 20 కిలోలు వేసుకోవాలన్నారు. అదేవిధంగా విత్తనం వేసిన 25 నుండి 35 రోజులకు యూరియా 50 కిలోలు, 35 నుండి 45 రోజులకు యూరియా 50 కిలోలు ,అలాగే 60 నుండి 65 రోజుల్లో యూరియా 50 కిలోలు, ఎం ఓ పి 25 కిలోలు వేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ విధంగా ఎరువులను వాడితే ఎకరాకు 42 42 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. అదేవిధంగా పొలం చుట్టూ నాలుగు వరుసలు మేత జొన్నలు వేయాలని సూచించారు. అదేవిధంగా జింక్ సల్ఫేట్ ఒక లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున ఎకరాకు 500 గ్రాములను ఫిజికారిచేయాలన్నారు. ప్రధానంగా మొక్కజొన్న పంటను ఆసించే కత్తెర పురుగు నివారణకు ఇమామెక్టిన్ జంబోయేట్ ఎకరాకు 100 గ్రాముల చొప్పున పిజికారి చేయాల్సి ఉంటుందన్నారు. లేదా కోరజోన్ 60 ఎం.ఎల్ ఎకరానికి పిసికారి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా వేరుశనగ పంటలు ఎగ్జాకొనజోల్ 500 ఎంఎల్ కాండంకుళ్లు తెగులుకు ,ఇమిడక్లో ప్రిడ్ ఎకరాకు 80ఎంఎల్ చొప్పున విధికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అల్తాఫ్ అలీ ఖాన్ ,మండల వ్యవసాయ అధికారి శ్రీలత, ఏ ఈ ఓ పుష్పలత,ఆర్ బి కే సిబ్బంది రఘు , తిరుమలేష్ ,సురేష్, ముత్యాలప్ప, రైతులు పాల్గొన్నారు.