విద్యుత్ కనెక్షన్ ఉన్న ప్రతీ వినియోగదారుడు తమ మొబైల్ నెంబర్ ను అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ రెవెన్యూ ఆఫీసులో తమ కనెక్షన్ కు సంబంధించిన వివరాలలో ఫోన్ నెంబర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. బిల్లులతో సహా ఇతరత్రా సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. దీనివల్ల బిల్లుల వివరాలను ఫోన్ కు మెసేజ్ చేస్తామని, ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవడం సులభంగా మారుతుందని చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి మెసేజ్ లు అందుకునే వీలుంటుందని పేర్కొన్నారు.