సీఎం జగన్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
రాజమండ్రి:సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్నిరకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 175 స్థానాల్లో జగన్ తరపున కాదు.. జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి సెటైర్ వేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనపడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నింటిని ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అన్నారు. చదువుకున్నవారు రోడ్లు బాలేదనో, ఇంకేదో లేదనో వైసిపికి వ్యతిరేకం అవ్వొచ్చు. రూరల్లో మాత్రం వైసిపి పాజిటివ్ గా ఉంది జగన్ 40%, చంద్రబాబుకు 40% ఓట్ పర్సంటేజ్ వస్తాయనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికలలో జనసేనకు 6% ఓట్ షేర్ రాగా, ఈ సారి పెరుగుతుందని చెప్పారు. వాస్తవంగా జనసేన, టిడిపి కలిసాయంటే రాష్ట్రంలో షేక్ రావాలి కానీ రాష్ట్రంలో అధికార పార్టీలో ఆ భయం కనిపించడం లేదన్నారు. మోడీ, జగన్ ఒకటే, వారి నిర్ణయాలు వారివే ఒకరు మాట వినరన్నారు.
అయితే వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామంటూ టీడీపీ హామీ ఇస్తుందని, కానీ ఇవన్నీ ఎలా సాధ్యమనే విషయాలను ప్రజలు ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవర్ని గెలిపించుకోవాలో ప్రజలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారన్నారు. జగన్ కాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు గ్యారంటీగా రద్దవుతాయన్నారు.
టీడీపీ, జనసేన కలిశాయనే భయం అధికార వైసీపీలో కనిపించడంలేదని ఉండవల్లి అన్నారు. వైసీపీ 40 శాతం, టీడీపీ 40 శాతం ఓట్ల పర్సంటేజ్ వస్తుందనుకుంటున్నానన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓట్లు వచ్చాయన్నా ఆయన ఈసారి ఓట్ పర్సంటేజ్ పెరుగుతుందన్నారు. కేంద్ర మధ్యంతర బడ్జెట్ పై స్పందిస్తూ… దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం మరోసారి చిన్నచూపు చూసిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరాదిలో ఎక్కువ స్థానాలు పెంచుతారన్నారు. జనాభా, అబద్దాల ప్రచారంలో ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఏపీ నుంచి ఎన్నికైన 25 మంది ఎంపీలూ బీజేపీకి మద్దతు దారులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలన్నారు.
దేశంలో దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఉండవల్లి మండిపడ్డారు. రామాలయం కట్టడం తప్పులేదు కానీ, జైశ్రీరామ్ పేరుతో రాజకీయ లబ్ధిపొందాలనుకోవడం తప్పన్నారు. సౌదిఅరేబియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఆలయాలు కట్టుకునే అవకాశం ఉందన్నారు. కానీ భారత్ లో హిందూయిజం పేరుతో సెక్యూలర్ పాలన కొనసాగుతుందన్నారు. ప్రధాని మోదీకి తన పాలనపై ఎన్నికలకు వెళ్తే ఏమవుతుందో తెలుసు కాబట్టే శ్రీరాముడి నామ జపం చేస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ మోస్ట్ మిస్ లీడింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు ఇచ్చిన నివేదికలో తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. అబద్ధాలు ప్రచారంలో భారత్ నెంబర్ స్థానంలో ఉంటే, అమెరికా 6వ స్థానంలో ఉందన్నారు.