Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలువిద్యాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు

విద్యాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు

పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అక్కరలేదా…
శాంతమ్మ, దీపికలను ఆశీర్వదించండి
రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

హిందూపురం టౌన్
రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు హిందూపురం పర్యటనలో భాగంగా శనివారం మున్సిపల్ పరిధిలోని అనేక వార్డుల్లో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తూ చిత్తశుద్ధితో పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న విదేశీ విద్య వసతి దీవెన వంటి పథకాల ద్వారా ఎంతో మంది నిరుపేద విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారని చెప్పారు అయితే కొంతమంది తమ స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యారంగంపై అనవసర విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు పేద విద్యార్థులు సైతం ఒకటవ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక ఒక్కొక్కరు ఒక్కోరకంగా అర్థం లేని విధంగా విమర్శలు చేస్తున్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె చంద్రబాబు నాయుడు కుమారుడు ఏ మీడియంలో చదివారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు డబ్బు ఉన్న వర్గాలు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని చదవాలా పేద వర్గాలు అర్హులు కారా అంటూ ధ్వజమెత్తారు ఇకపోతే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అనేక పథకాలను అమలు చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని ఆర్థిక అభివృద్ధి సాధిస్తుండటం అభినందనీయమన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు ఇవ్వని ఎన్నో హామీలను అమలు చేసిన ఘనత భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ప్రశంసించారు. ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో అన్ని వార్డుల్లో మురుగు కాలువలు, సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న జగనన్న ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అందరూ సహకరించాలన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు స్థానానికి బోయ శాంతమ్మ అసెంబ్లీ స్థానానికి దీపిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని వీరిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు పరిశీలకులు ఈశ్వర్ రెడ్డి టీటీడీ బోర్డు డైరెక్టర్ పోకల అశోక్ బాబు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని. జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ఫైర్దొస్ ఖలీల్, వైఎస్ఆర్సిపి నాయకులు మధుమతి రెడ్డి, వజ్ర భాస్కర్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ,మున్సిపల్ వైస్ చైర్మన్లు బలరాం రెడ్డి, జబీ ఉల్లా, నాయకులు బెల్లం నరేష్, కౌన్సిలర్లు మాజాన్, సునీత వెంకటేష్ రెడ్డి, పరుశురాం, వార్డు ఇన్చార్జ్ కవితా అరుణాచలం శివశంకర్ రెడ్డి, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article