Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుడిఎస్సీ అభ్యర్థులను నయా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

డిఎస్సీ అభ్యర్థులను నయా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలి

25 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి

డివైఎఫ్ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు డిమాండ్

కడప సిటీ ,

డిఎస్సీ అభ్యర్థులను నయా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలి, 25 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ ) నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు డిమాండ్ చేశారు
పాత బస్టాండు డివైఎఫ్ఐ కార్యాలయంలో డీఎస్సీ అభ్యర్థులు కుశీల్ కుమార్, విద్యాసాగర్ డి వైఎఫ్ఐ నాయకులుఉదయ్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు
ఈ సందర్బంగా డి.ఎం. ఓబులేసు మాట్లాడుతూ డీఎస్సీ ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి ఊరిస్తూ కేవలం 6100 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ కోసం డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళనలు నిర్వహించి చివరకు మంత్రి బొత్స సత్యనారాయణ ఇళ్లు ముట్టడి, ఛలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి చేసిందని ఈ సందర్భంగానే వందలాది మంది పై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది తప్ప మెగా డీఎస్సీ ప్రకటించలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్ నాటికి జూన్ వరకు రిటైర్డ్ అవుతున్న ఉపాధ్యాయుల సంఖ్య ఇందులో చేర్చి ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులు సంఖ్య పెంచాలని, వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండేళ్లు అప్రెంటిష్ విధానాన్ని తీసుకోరావడం ఎమిటి అని ప్రశ్నించారు ఇది ఎప్పుడో రద్దు చేశారని తిరిగి అప్రెంటి విధానాన్ని తీసుకోరావడం సరికాదన్నారు. 25వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 6100 పోస్టులు భర్తీ అనడం నిరుద్యోగులను మోసం చేయడమే. నాలుగు సంవత్సరాల నుంచి 10 లక్షల మంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే మెగా డీఎస్సీని ప్రకటించాలని ఇది దగా డీఎస్సీ అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సర కాలంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోస్టులకు, మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలో నిరుద్యోగులకుఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article